లేబర్‌ చట్టం ఉల్లంఘన: సుమారు 900 మంది అరెస్ట్‌

లేబర్‌ చట్టం ఉల్లంఘన: సుమారు 900 మంది అరెస్ట్‌

మస్కట్‌: ఒమన్‌ మినిస్ట్రీ ఆఫ్‌ మేన్‌ పవర్‌ వెల్లడించిన వివరాల ప్రకారం 880 మంది వలసదారుల్ని లేబర్‌ చట్టం ఉల్లంఘనకు పాల్పడినందుకుగాను అరెస్ట్‌ చేయడం జరిగింది. 410 మందిని డిపోర్టేషన్‌ కూడా చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్‌ మేన్‌ పవర్‌ వెల్లడించింది. మినిస్ట్రీ ఆఫ్‌ మేన్‌ పవర్‌, ఇతర గవర్నమెంట్‌ అథారిటీస్‌తో కలిసి నిర్వహించిన తనిఖీల్లో ఈ ఉల్లంఘనలు బయటపడ్డాయి. మార్చి 10 నుంచి 16 మధ్య అరెస్టులు జరిగినట్లు అధికారులు తెలిపారు. 303 మంది తమ ఉద్యోగాల్ని వదిలేయగా, 410 మంది ఫ్రీలాన్సింగ్‌ చేస్తున్నారు. 166 మంది వద్ద సరైన డాక్యుమెంట్స్‌ లేవు. 619 వర్కర్స్‌ కమర్షియల్‌ సేల్స్‌ వర్క్‌ చేస్తుండగా, 85 మంది అగ్రికల్చర్‌లో పనిచేస్తున్నారు. 176 మంది డొమెస్టిక్‌ వర్కర్స్‌. క్యాపిటల్‌ మస్కట్‌లో అత్యధిక అరెస్టులు 626 జరిగాయి.

 

Back to Top