టిక్ టాక్ అభిమానులకు గుడ్ న్యూస్..

- April 24, 2019 , by Maagulf
టిక్ టాక్ అభిమానులకు గుడ్ న్యూస్..

చైనీస్ యాప్ టిక్ టాక్ అతి తక్కువ కాలంలోనే నెటిజన్స్ మనసు దోచుకుంది. టిక్ టాక్ వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ.. హల్‌చల్ చేశాయి. దీంతో ఈ
యాప్ పాపులారిటీ సంపాదించింది. అయితే ఆశ్లీలత, విద్వేషాలను రెచ్చగొట్టే వీడియోలు ఉన్నాయన్న కారణంగా మద్రాస్ హైకోర్టు ఏప్రిల్ 3న భారత్‌లో టిక్ టాక్ యాప్‌
డౌన్‌లోడ్‌ను బ్యాన్ చేసింది. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించింది.

కోర్టు ఆదేశాలపై టిక్ టాక్ రూపకర్త బైటెడెన్స్ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం టిక్ టాక్ నిషేధంపై మద్రాస్ హైకోర్టు
వైఖరేంటో ఏప్రిల్  24వ తేదీలోగా స్పష్టం చేయాలని సూచించింది. అప్పటికి హైకోర్టు నిర్ణయం తీసుకోవడంలో విఫలమైతే ఆ న్యాయస్థానం ఇచ్చిన నిషేధ ఆదేశాలు చెల్లుబాటు కావని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు.. టిక్ టాక్ యాప్‌పై నిషేధం ఎత్తివేస్తు మధ్యంతర ఉత్తర్వులు జారి చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com