స్మార్ట్‌ఫోన్‌పై రూ.9,000 డిస్కౌంట్..
- April 26, 2019ఈ-కామర్స్ దిగ్గజం ప్లిప్‌కార్ట్ సూపర్ వ్యాల్యూ వీక్ పేరుతో డిస్కౌంట్ సేల్ అందుబాటులోకి తెచ్చింది. ఈ సేల్ ఏప్రిల్ 29 వరకు కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. సేల్‌లో భాగంగా పది రకాల హానర్ స్మార్ట్‌ఫోన్ వేరియంట్లను డిస్కౌంట్లో సొంతం చేసుకోవచ్చు. హానర్ 9ఎన్లో 4 జీబీ ర్యామ్+128 జీబీ మెమరీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.11,999కు, 3 జీబీ ర్యామ్+32 జీబీ మెమరీ వేరియంట్‌ను 8,999కు కొనుగోలు చేయవచ్చు. హానర్ 9 లైట్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ వేరియంట్‌ను రూ.9,999కు కొనవచ్చు.
హానర్ 10 లైట్ 3 జీబీ ర్యామ్+జీబీ మెమరీ వేరియంట్‌ను రూ.11,999కు సొంతం చేసుకోవచ్చు. ఇందులోనే 4 జీబీ ర్యామ్+64 జీబీ మెమరీ వేరియంట్‌ను రూ.13,999కు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ.16,999. హానర్ 9 ఐ ఫోన్ రూ.10,999కు అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.19,999. అలాగే రెడ్మీ నోట్ 6 ప్రో, శాంసంగ్ గెలాక్సీ నోట్ 8, గెలాక్సీ ఎస్8 వంటి వివిధ రకాల ఫోన్లపై ఆఫర్లు పొందవచ్చు. సేల్‌లో భాగంగా ప్లిప్‌కార్ట్ కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్‌ని కేవలం రూ.99కే పొందవచ్చు. ఇంకా ఈ సేల్‌లో ఎక్సేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్‌లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు