యాపిల్ టీ గురించి ఎప్పుడైనా విన్నారా??
- May 08, 2019లెమన్ టీ, గ్రీన్ టీ, జింజర్ టీ అంటూ చాలా టీలే తాగుతుంటారు టీ ప్రియులు. మరి యాపిల్ టీ గురించి ఎప్పుడూ విని వుండరు. రోజుకో యాపిల్ తింటే వైద్యునికి దూరంగా ఉండొచ్చు అని అంటారు. యాపిల్ టీని తాగడం వలన కూడా ఎన్నో ప్రయోజనాలు అని అంటున్నారు న్యూట్రీషియనిస్టులు. ఈ టీ రుచిగా ఉండడంతో పాటు శరీరం ఫిట్‌గా ఉండేందుకు దోహదపడుతుంది. ఇప్పటికే యూరప్‌లో ఎంతో ప్రజాదరణ పొందిన ఈ యాపిల్ టీ రోగనిరోధక వ్యవస్థను పెంపొందిస్తుంది. ఇన్ఫెక్షన్లను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉదర సంబంధ సమస్యలకు యాపిల్ టీ చక్కటి ఔషధం. యాపిల్ టీ రోజూ తీసుకుంటే సౌందర్యం పెరుగుతుంది. చర్మం కాంతి వంతంగా ఉంటుంది. జాయింట్ పెయిన్ సమస్యలను నివారిస్తుంది. శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. ఇక ఈ యాపిల్ టీని ఎలా తయారు చేయాలో చూద్దాం..
ఓ పాత్రలో టీకి సరిపడా నీళ్లు తీసుకోవాలి. ఆ తరువాత శుభ్రం చేసిన యాపిల్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలు చేసి మరుగుతున్న నీటిలో వేసి 10 నిమిషాలు ఉంచాలి. ఆ తరువాత టీ పొడి, లవంగ దాల్చిన చెక్కపొడి కొద్దిగా వేసి కలిపి మరికాసేపు మరిగించాలి. తరువాత దించి కొద్దిగా తేనె కలిపి తాగాలి. రోజులో ఏదో ఒక టైమ్‌లో ఈ యాపిల్ టీ ట్రై చేయండి. అందంతో పాటు ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం