లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- May 20, 2024
ఛత్తీస్‌గడ్: ఛత్తీస్‌గడ్‌లోని కబీర్‌ధామ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పికప్ వాహనం ఓ లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 18 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో 14 మంది మహిళలు ఉన్నారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కుక్‌దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహపానీ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
బైగా గిరిజన తెగకు చెందిన 25 నుంచి 30 మంది అడవి నుంచి టెండు ఆకుల తెంపుకుని తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న పికప్ వాహనం బహపానీ ప్రాంతం సమీపంలో ఓ మలుపు వద్ద అదుపు తప్పి సుమారు 20 అడుగుల లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా.. కొందరు ఘటనాస్థలంలోనే మరణించగా మరికొందరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. వీరంతా కుయ్ నివాసితులు అని చెప్పారు.
బైగా కమ్యూనిటీ బీడీ తయారీ చేస్తుంటారు. ఇందుకోసం వీరు వారు టెండు ఆకులను సేకరింస్తుంటారు. ఈ ఆకులను బీడీలు చుట్టడానికి ఉపయోగిస్తారు.
ఈ ప్రమాదం పై ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..