సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- May 20, 2024
హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన దాదాపు నాలుగు గంటలపాటు మంత్రివర్గ సమావేశం సాగింది. ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ సాగు ప్రణాళిక, కాళేశ్వరం బ్యారేజీ మరమ్మతులు, విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే బడులు తదితర అంశాలపై కేబినెట్ చర్చించింది. అకాల వర్షాలు ఎప్పుడు లేనివిధంగా పడుతున్నాయని.. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనాలని నిర్ణయించారు. రైతులకు నష్టం జరగకుండా.. MSPకి ఒక్కరూపాయి కూడా తగ్గకుండా.. చివరిగంజ వరకు ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత కలెక్టర్లకు అప్పగించారు. సన్నవడ్లు పండించిన రైతులకు క్వింటాకు 500 బోనస్ ఇవ్వాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించాలని ఆధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై NSDA ఇచ్చిన మధ్యంతర నివేదికపైనా మంత్రివర్గంలో చర్చించారు. తాత్కాలికంగా మరమ్మతులు చేసైనా సరే రైతులకు నీరు ఇవ్వాలని మంత్రివర్గంలో నిర్ణయించినట్టు మంత్రి పొంగులేటి తెలిపారు.
ప్రైవేటు స్కూళ్లకు దీటుగా గవర్నమెంట్ బడులు తీర్చిదిద్దాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. గత దశాబ్ధకాలంలో విద్యా వ్యవస్థను బీఆర్ఎస్ విస్మరించిందని.. తమ మార్క్ ఏంటో చూపిస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. విద్యావ్యవస్థకు పెట్టపీట వేస్తూ నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు. బడుల్లో మౌళిక సదుపాయల విషయాల్లోనూ తగ్గేదేలేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. అవతరణ వేడుకలు గ్రాండ్ జరపాలని మంత్రివర్గంలో తీర్మానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ వేడుకలకు..తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఆహ్వానించాలని నిర్ణయించారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల నిర్వహణకు ఈసీ అనుమతి కోరుతూ లేఖ రాయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
కాళేశ్వరం బ్యారేజీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్యామేజ్ జరిగిన బ్యారేజీలను మరమ్మత్తులు చేయించాలని కేబినెట్ తీర్మానించింది. మరమ్మత్తులకు ముందు టెక్నికల్ టెస్టులను చేయించనుంది. బ్యారేజ్ సేఫ్టీ ఎక్స్పర్ట్ కంపెనీలతో మంత్రులు, అధికారుల బృందం పరిశీలన చేయనుంది. వచ్చే వర్షాకాలం లో నీళ్లను లిఫ్ట్ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది.
తాజా వార్తలు
- HR88B8888 నంబర్‌కు అపార డిమాండ్
- హైదరాబాద్: సస్పెండ్ చేసిన ఎస్ఐ పై షాకింగ్ నిజాలు
- లోక్‌సభ లెజిస్లేషన్ కమిటీ సమావేశం నిర్వహించిన ఎంపీ బాలశౌరి
- గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోడీ ని ఆహ్వానించాలి: సీఎం రేవంత్
- 2030 కామన్వెల్త్ గేమ్స్ కోసం అహ్మదాబాద్ సిద్దం
- హాంకాంగ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..13 మంది సజీవదహనం..
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?







