టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- May 20, 2024
హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథ్స్) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీ ఫార్మసీ సెంకడియర్ ప్రవేశానికి నిర్వహించిన తెలంగాణ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ -2024 ఫలితాలు కాసేపటి క్రితం విడుదలయ్యాయి. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఆ సంస్థ చైర్మన్ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. అయితే, మే 6న మొత్తం 99 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. 24,272 మంది అభ్యర్థులు ఈసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈసెట్ పరీక్షలను నిర్వహించారు. పరీక్ష రాసిన విద్యార్థినీ విద్యార్థులు https://ecet.tsche.ac.in/ వెబ్‌సైట్‌కు వెళ్లి ఫలితాలను తెలుసుకోవచ్చని ఉన్నత విద్యా మండలి అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్‌లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్‌లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్‌లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







