4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు

- May 20, 2024 , by Maagulf
4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు

అమెరికా: శివుని ఢమరుకం నుండి 14 మహేశ్వర సూత్రాలు వెలువడి ఆ నాదం శబ్ద ప్రపంచంగా విస్తరించినట్టుగా బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అంతరంగం నుండి ఉద్భివించినవి దాదాపు 1100 పైగా అద్భుతమైన శివపద గీతాలు.ఋషిపీఠం ఆధ్వర్యంలో వాణి గుండ్లాపల్లి నిర్వహణలో నాల్గవ శివపద అంతర్జాతీయ పాటల పోటీ ఈ నెల (మే 2024)16,17,18 న యూట్యూబ్ మాధ్యమంగా నిర్వహించారు. 

ఎప్పటి లాగే, ఈ శివపదార్చనలో అనేక దేశాల నుంచి 7-70 సంవత్సరాల వయస్సులో వారు దాదాపు 250 మంది ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ పోటీలలో పాల్గొనటానికి సన్నధ్ధులవుతన్నప్పటి నుంచీ శివపద ఝరి లో ఓలలాడామని పాల్గున్న వారు అన్నారు. వయసుల వారీగా "ఉపమన్యు", "మార్కండేయ", "భక్త కన్నప్ప", "నత్కీర","పుష్పదంత" అనే 5 విభాగాలుగా విభజించారు.13 మంది  ప్రఖ్యాత  సంగీతగురువులు US,భారత్ ,ఆస్ట్రేలియా, సింగపూర్ నుంచి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.తులసి విశ్వనాథ్, పద్మ త్యాగరాజన్, శారదా సుబ్రమణియన్,కౌశిక్ కల్యాణ్,పెద్దాడ సూర్యకుమారి,RV లక్ష్మి మూర్తి, విష్ణుప్రియ భరధ్వాజ్,శ్రీకాంత్ మల్లాజ్యోస్యుల,లక్ష్మిశేష భట్టుకు,సరస్వతి కాశి,అనీల కుమార్ గరిమెళ్ళ,లలిత రాంపల్లి. శేషు  కుమారి యడవల్లి,అరవల్లి శ్రీదేవి, విద్య భారతి తదితరులు న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు. 

అందరి పాటలనూ విన్న బ్రహ్మ శ్రీ షణ్ముఖ శర్మ, జీవిత ప్రయాణమే శివ మయం అనీ, ఈ శివ పద జ్ఞాన యజ్ఞం ప్రపంచవ్యాప్తంగా విస్తరించటం, తద్వారా పిల్లలకు మన సంస్కృతి సంప్రదాయాలు తెలియబడటం ఎంతో ముదావహం అన్నారు.  పాల్గొన్న అందరికీ, శ్రధ్ధగా విని, తమ నిర్ణయాలనీ, సూచనలనీ అందించిన న్యాయ నిర్ణేతలందరికీ  శివాశీస్సులు అందించారు. 

ఈ సంవత్సరం ఋషిపీఠం రజతోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా, శివపదం గానం, నృత్యము ప్రపంచవ్యాప్తం గా గుర్తింపు పొందటం, మరింత సంతోషం కలిగించే విషయమని,ఈ పోటీలను నిర్వహిస్తున్న గుండ్లపల్లి వాణి అన్నారు.ఈ సందర్భంగా కాసాబ్లాంకా, బాలి, గ్రీస్ వంటి దేశాలలో శివపద నృత్య ప్రదర్శనలు నిర్వహించామని, ఇందులో పాల్గొనే చిన్నారులు, పెద్దలూ అందరూ కూడా మన " కల్చరల్ అంబాసడార్స్" అని అన్నారు. 

ఈ కార్యక్రమం ఇంత అద్భుతం గా సాగటానికి కారణమైన ఋషిపీఠం వారికి, ఓలేటి వెంకట పవన్, శ్రీనివాస్ మేడూరి, మేఘన వారణాసి శ్రీకాంత్ వడ్లమానికి ప్రేత్యేక ధన్యవాదాలు తెలియ చేసారు వాణి. అలాగే  శివపద బృందం అయినటువంటి  నాగ సంపత్ వారణాసి, విజయ వడ్లమాని, రవి గుండ్లాపల్లి కు ధన్యవాదాలు తెలిపారు.శివపద బృందానికి గురువు ప్రత్యేక ఆశీస్సులు తెలియ చేశారు.రాధికా కామేశ్వరికి ప్రత్యేకధన్యవాదాలు.వందల గళాలలో సాగిన ఈ శివపదార్చన వేల గళాలలో లో జరగాలని ,ఋషిపీఠం ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని మనసారా ఆశిద్దాము.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com