విండోస్ ఫోన్లలో ఇకపై వాట్సాప్ పనిచేయదు..!
- May 08, 2019![1 విండోస్ ఫోన్లలో ఇకపై వాట్సాప్ పనిచేయదు..!](https://www.maagulf.com/godata/articles/201905/WhatsApp-kHAI--621x414@LiveMint_1557308206.jpg)
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇకపై విండోస్ ఫోన్లలో పనిచేయదని ఆ సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ 31 తరువాత విండోస్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని వారు తెలిపారు. మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్ ఫోన్లకు డిసెంబర్లో సపోర్ట్‌ను నిలిపివేయనున్న నేపథ్యంలోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వాట్సాప్ తెలిపింది. కాగా ఫిబ్రవరి 1, 2020 నుంచి ఆండ్రాయిడ్ 2.3.7, ఐఓఎస్ 7 అంత కన్నా తక్కువ వెర్షన్ ఓఎస్‌లు ఉన్న డివైస్‌లలోనూ వాట్సాప్ పనిచేయదని ఆ కంపెనీ చెబుతున్నది. అయితే విండోస్ ఫోన్లు, డెస్క్‌టాప్‌ల కోసం త్వరలోనే యూనివర్సల్ విండోస్ ప్లాట్‌ఫాం పేరిట ఓ కొత్త వాట్సాప్ వెర్షన్‌ను వాట్సాప్ అందుబాటులోకి తేనుందని తెలుస్తున్నది..!
తాజా వార్తలు
- అమెరికాలో ఘనంగా ఎన్డీఏ కూటమి విజయోత్సవ సభ
- తిరుమలలో క్యూ లైన్లను తనిఖీ చేసిన టీటీడీ ఈవో
- ఏపీ సీఎం చంద్రబాబుకు సవాల్ గా మారనున్న పరిపాలన?
- ఈద్ అల్ అదా.. అర్థరాత్రి వరకు పబ్లిక్ పార్కులు
- ఉక్రెయిన్ శాంతి ప్రక్రియలో రష్యా భాగస్వామ్యం అవసరం.. సౌదీ
- యూఏఈలో ఈద్ అల్ అధా వేడుకలు ప్రారంభం
- భవనాలలో అత్యవసర ఎగ్జిట్ మార్గాలు.. ప్రతిపాదనకు ఆమోదం
- ‘లులూ లెట్స్ కనెక్ట్’ స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు
- ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించిన సుల్తాన్
- మంత్రిగా నారాయణ బాధ్యతలు స్వీకరణ..