తిరుమలలో క్యూ లైన్లను తనిఖీ చేసిన టీటీడీ ఈవో
- June 16, 2024
తిరుమల: టీటీడీ ఈవో జె.శ్యామలరావు ఆదివారం సాయంత్రం తిరుమలలోని క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లను పరిశీలించి భక్తులకు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ, తన తొలి తనిఖీలో భక్తులకు టీటీడీ అందిస్తున్న అన్నప్రసాదాలు, తాగునీరు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి భక్తుల నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నట్లు చెప్పారు.
కొన్ని చోట్ల భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు అందుతుండగా, కొన్ని ప్రాంతాల్లో పాలు అందడం లేదని చెప్పినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు, షెడ్లలో వేచి ఉన్న వారికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.ఈవో వెంట జేఈవో వీరబ్రహ్మం, సివిఎస్‌వో నరసింహ కిషోర్, సిఈవో షణ్ముఖ్ కుమార్, సిఈ నాగేశ్వరరావు, ఎస్ఈ 2 జగదీశ్వర్ రెడ్డి, డీవైసీఎఫ్ శ్రీనివాసులు, ఇతర అధికారులు ఉన్నారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీస్ లు పునరుద్దరణ
- అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- హైదరాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- పార్టీ నేతల తీరు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి
- దుబాయ్లో వీసా మోసం కేసు: 21 మంది దోషులు
- ఖతార్ లో విమాన రాకపోకలు ప్రారంభం
- డ్రగ్స్ కొనుగోలు చేశాను.. అమ్మలేదు: శ్రీరామ్
- TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఏర్పాటు
- ట్యాక్స్ అనేది చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం..!!
- కొన్ని యూఏఈ, జీసీసీ ఫ్లైట్స్ తాత్కాలికంగా నిలిపివేత..!!