రోడ్డు ప్రమాదంలో ‘జబర్దస్త్’ చంటికి గాయాలు..
- June 18, 2019గత రెండు మూడు రోజులుగా షూటింగులో గాయాలపాలైన నటులు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. నటుడు శర్వానంద్, నాగశౌర్య, సందీప్ కిషన్, వరుణ్ తేజ్. తాజాగా బుల్లితెర ఫేమస్ కామెడీ షో జబర్దస్త్‌లో నటించే చలాకీ చంటి కారు ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు ఆయన చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. మంగళవారం ఉదయం విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఆరు గంటల సమయంలో సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కొమరబండ వద్ద చంటి కారు ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో చంటి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న కోదాడ పోలీసులు అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. చంటిని కోదాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం చంటి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. గత ఏడాది కూడా జూన్ నెలలోనే చంటి కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు చంటి. అయితే ఆనాటి ప్రమాదంలో గుద్దుకున్న రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. సరిగ్గా ఏడాది తరువాత అదీ జూన్ నెలలోనే ప్రమాదానికి గురి కావడం ఆందోళన కలిగిస్తోంది.
తాజా వార్తలు
- పాఠశాలలకు బాంబు బెదిరింపుల కలకలం..
- ముబారక్ అల్-కబీర్‌ను కలిసిన భారత రాయబారి
- ఖతార్‌లో ఆహార భద్రతపై మంత్రిత్వ శాఖ క్లారిటీ
- యూఏఈలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..!
- ఈ రోజుల్లో ఒమానీలకు ఉచిత బస్సు సేవలు
- పీక్ అవర్స్ కోసం దుబాయ్ మెట్రో కొత్త ప్రోటోకాల్స్
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు