Facebook Libra క్రిప్టోకరెన్సీ, భారత్ కు రావడం కష్టమే
- June 24, 2019సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ కొత్తగా వివాదాస్పద క్రిప్టో కరెన్సీ చెల్లింపుల విధానం బిట్ కాయిన్ కరెన్సీ లిబ్రాను ప్రభుత్వాలు, ఆర్ధిక దిగ్గజాల ఆమోదంతో మార్కెట్లోకి తీసుకొస్తోందనే వార్తలు ఓ ఊపు ఊపుతున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఫేస్బుక్ క్రిప్టోకరెన్సీని 2020లో అధికారికంగా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోందని, ఈ ప్రాజెక్టులో ప్రపంచ అతిపెద్ద కార్పొరేట్ సంస్థలైన వీసా ఇంక్, మాస్టర్ కార్డ్ ఇంక్, పేపాల్ హోల్డింగ్స్ ఇంక్, ఉబర్ టెక్నాలజీస్ భాగస్వామలుగా ఉండనున్నాయని తెలిపింది. ప్రపంచ దేశాలకు ఈ క్రిప్టోకరెన్సీని పరిచయం చేస్తామని తెలిపింది.అయితే ప్రపంచదేశాలకు ఇది పరిచయమైనా ఇండియాలో దీనికి బ్రేక్ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బ్రేక్ పడే అవకాశాలు Facebookకి అతి పెద్ద మార్కెట్ ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. అందుకే Facebook ఇండియాలో కూడా లిబ్రా క్రిప్టోకరెన్సీ, కాలిబ్రా డిజిటల్ వ్యాలెట్ లాంచ్ చేయాలని చూస్తోంది. కానీ, ప్రపంచ దేశాలతో పాటు ఇండియాలో కూడా లీగల్ బిట్ కాయిన్ కరెన్సీని తీసుకురావాలనే Facebook ప్రయత్నాలకు బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియాలో ప్రస్తుతం ఉన్న రెగ్యులేషన్స్ ప్రకారం.. క్రిప్టోకరెన్సీకి దేశంలో అనుమతి లేదు.
తాజా వార్తలు
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!