ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- May 17, 2024
హైదరాబాద్: గత కొన్ని సీజన్లుగా పేలవ ప్రదర్శనతో తీవ్ర విమర్శల పాలైన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో అదరగొడుతోంది. కొత్త కెప్టెన్ పాట్ కమిన్స్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ ఈ సీజన్లో ప్లే ఆఫ్స్‌కు దూసుకువెళ్లింది. గురువారం ఉప్పల్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో సన్‌రైజర్స్ తలపడాల్సి ఉండగా ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఇరు జట్లకు అంపైర్లు చెరో పాయింట్‌ను కేటాయించారు. 15 పాయింట్లతో సన్‌రైజర్స్ ఈ సీజన్లో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన మూడో జట్టుగా నిలిచింది.
చాన్నాళ్ల తరువాత ప్లే ఆఫ్స్‌లో హైదరాబాద్ అడుగుపెట్టడంతో జట్టు యజమాని కావ్యా మారన్ పట్టరాని సంతోషంలో మునిగిపోయింది. వేలంలో తాను కొనుగోలు చేసిన ఆటగాళ్లు అద్భుతంగా రాణించి ప్లే ఆఫ్స్‌కు చేర్చడంతో సంబరాల్లో మునిగిపోయింది.
ఈ సంతోష సమయంలో ఓ అనుకొని అతిథి కావ్యా మారన్ వద్దకు వచ్చాడు. అతడి చూసిన ఆమె ఎంతో ఆప్యాయంగా పలకరించడమే కాదు కౌగిలించుకుంది. అతడు మరెవరో కాదు సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా.. కేన్ మామ 2021, 2022 సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతడి నాయకత్వంలో ప్లే ఆఫ్స్‌కు చేరడంలో విఫలం కావడం, జట్టు దారుణ ప్రదర్శన చేయడంతో సన్‌రైజర్స్ అతడిని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి వేలానికి విడిచిపెట్టింది. ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ కేన్ మామను సొంతం చేసుకుంది.
గురువారం సన్‌రైజర్స్, గుజరాత్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడం.. తన పాత జట్టు హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌కు వెళ్లడంతో అక్కడే ఉన్న కావ్యా మారన్ ను విలియమ్సన్ వెళ్లి పలకరించాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







