'అయోగ్య'తెలుగు ట్రైలర్ విడుదల
- August 06, 2019యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ మూవీ టెంపర్.. తమిళనాట 'అయోగ్య' పేరుతో రీమేక్ అయ్యింది. తమిళ్‌తో పాటు, తెలుగులోనూ అభిమానులను సంపాందించుకున్న యంగ్ హీరో విశాల్ హీరోగా నటించగా.. అతనికి జోడీగా రాశీ ఖన్నా నటించింది.. లైట్ హౌస్ మూవీ మేకర్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై, ఠాగూర్ మధు నిర్మించగా.. వెంకట్ మోహన్ డైరెక్ట్ చేసిన అయోగ్యని.. తెలుగులో అదే పేరుతో డబ్ చేసి విడుదల చెయ్యనున్నారు. రీసెంట్గా తెలుగు ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.
విశాల్‌కి వేరే వ్యక్తితో డబ్బింగ్ చెప్పిచడంతో ట్రైలర్ ఏమంత ఆసక్తిగా అనిపించలేదు. పందెంకోడి 2 ప్రమోషన్స్ టైములో.. అయోగ్యను తెలుగులో రిలీజ్ చెయ్యం, తెలుగు ఆడియన్స్ యాక్టింగ్ పరంగా నన్ను తారక్‌తో కంపేర్ చేస్తారు.. నేను తను చేసినంత బాగా ఆ క్యారెక్టర్ చెయ్యలేను అని చెప్పాడు విశాల్. తమిళ్ రిజల్ట్‌ని దృష్టిలో పెట్టుకుని నిర్మాత తెలుగులో విడుదల చేస్తున్నట్టున్నాడు. ఇక్కడ ఎన్టీఆర్ దయగా కనిపిస్తే, విశాల్ కర్ణగా కనిపించనున్నాడు.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం