సముద్రం
- June 02, 2016ఒక్క కవితాబీజం మస్తిష్కక్షేత్రంలో ఎన్ని కవితలనైనా పుట్టించేస్తుంది. ఏ మహాకవి ఉదాత్త కమనీయ భావనో తెలీదు కానీ,
చాలా ఏళ్ల క్రితం "సముద్రం నీరు ఎంత ఉప్పనో! అవి ఎన్ని చేపల కన్నీళ్లో" అనే కవిత విన్నాను ఎక్కడో. అది గుర్తొచ్చి నన్ను ఇందాక కుదిపింది. ఇలా రాసుకున్నాను.
సముద్రం నీరు
ఉప్పన-
ఎగసి ఎగసి ఆడి
చెమట పట్టడంవల్లేమో!
ఉప్పు ఎక్కువైతే
హై బీ.పీ మనకి!
సముద్రంలో
చేపల సంగతేంటో!!
సముద్రం
ఎండదు, ఇంకదు-
సూర్యుడికి, భూదేవికి
"నో సాల్ట్ డైట్".
నదుల నీళ్లన్నీ
దోచేసి
ఒక్క చుక్కా తాగనివ్వడు-
సముద్రుడు నీటిదొంగ.
పిల్లల చేతి స్పర్శకోసం
ఎదురు చూస్తోంది!
సముద్రం పక్కన
తడిసిన ఇసుక.
-సిరాశ్రీ
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్‌లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్‌సైకిల్‌కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్‌ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…