TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- May 06, 2024
హైదరాబాద్: ఎక్స్‌ప్రెస్ నెలవారీ సీజన్ టిక్కెట్ పాస్ హోల్డర్లకు టీఎస్ఆర్టీసీ శుభవార్త అందించింది. ఈ పాస్ కలిగి ఉన్న వారు డీలక్స్ బస్సుల్లోనూ ప్రయాణించే వెసులుబాటును టీఎస్ఆర్టీసీ కల్పించింది. ఇప్పటి వరకు ఈ పాస్ ఉన్నవారు ఎక్స్ ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ప్రయాణించడానికి వీలుండేది. తాజాగా, డీలక్స్ బస్సుల్లో కూడా ప్రయాణించే సౌకర్యాన్ని టీఎస్ఆర్టీసీ కల్పించింది. రూ.20 కాంబినేషన్ టికెట్ తీసుకుని డీలక్స్ బస్సుల్లో ప్రయాణించవచ్చు.
ఎక్స్ ప్రెస్ ప్రయాణీకులకు మాత్రమే ఈ సౌకర్యం వర్తిస్తుందని టీస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్‌లో తెలిపారు. 100 కిలోమీటర్ల పరిధిలో జారీ చేసే ఈ పాస్ కావాలనుకునే వారు టీఎస్‌ఆర్టీసీకి చెందిన స్థానిక బస్ పాస్ కౌంటర్లను సంప్రదించగలరు అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!