శర్వా సినిమా తొలి షెడ్యూలు షూటింగ్ పూర్తి..
- June 10, 2016గమ్యం, రన్ రాజా రన్ లాంటి సినిమాలలో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శర్వానంద్.. ఈసారి ఓ పోలీసు పాత్ర పోషిస్తున్నాడు. భలే భలే మగాడివోయ్ సినిమాతో మంచి బ్రేక్ సాధించిన లావణ్య త్రిపాఠీ అతడి సరసన నటిస్తోంది. ఈ సినిమాలో శర్వా ఫస్ట్ లుక్ శుక్రవారం ట్విట్టర్ ద్వారా విడుదలైంది. విజయవంతమైన భారీ చిత్రాల నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇన్ని విశేషాలున్న ఈ సినిమాకు ఇంకా పేరు మాత్రం ప్రకటించలేదు.సినిమా తొలి షెడ్యూలు షూటింగ్ కూడా పూర్తయింది. ఈనెల 15వ తేదీ నుంచి రెండో షెడ్యూలు షూటింగ్ కొనసాగుతోంది. ఈ విషయాలను మరో అగ్ర నిర్మాత మహేష్ కోనేరు తన ట్వీట్ ద్వారా వెల్లడించారు.ఈ సినిమాతో చింతాడ చంద్రమోహన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు సంగీతం: రతన్, సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని, లైన్ ప్రొడ్యూసర్: చక్రవర్తి రామచంద్ర, సమర్పణ: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, దర్శకత్వం: చంద్రమోహన్ చింతాడ.
తాజా వార్తలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక
- సదా, రఖ్యూత్లో భారీ వర్షాలు
- మే 6, 7వ తేదీల్లో అంతర్జాతీయ న్యాయ శిక్షణ సదస్సు
- ఆపరేషన్ గాలంట్ నైట్ 3 పేరుతో నకిలీ లింక్లు..హెచ్చరిక
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన