ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతి

- March 16, 2025 , by Maagulf
ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతి

అమరావతి: ఏపీ ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టుకు సంకల్పించింది. అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచనకు అనుగుణంగా భారీ స్థాయిలో అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. అమరావతి ఓఆర్ఆర్ మొత్తం 189.9 కిలోమీటర్ల పొడవు ఉండనుంది. తెలంగాణలోని హైదరాబాద్ ఓఆర్ఆర్ కంటే ఇది ఎక్కువ పొడవు అని తెలిసిందే.

అమరావతి ఓఆర్ఆర్ భూ సేకరణకు అధికారులను నియమించి, మరో వైపు NHRI ప్రతిపాదిత ఎలైన్ మెంట్లో ఏపీ ప్రభుత్వం మార్పులు చేర్పులతో ఆమోదం తెలపనుంది. పల్నాడు, గుంటూరుతో పాటు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో భూ సేకరణకు జేసీలను అధికారులుగా నియమించారు.

ఐదు జిల్లాల్లోని 23 మండలాల్లో, 121 గ్రామాల మీదుగా ఈ ఓఆర్ఆర్ నిర్మాణం జరగనుంది. అమరావతి ఓఆర్ఆర్ ఏ జిల్లాల్లో ఏ గ్రామాల నుంచి వెళ్తుందని స్థానిక ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఆ జిల్లాలు, మండలాలు, గ్రామాల వివరాలిలా ఉన్నాయి..

గుంటూరు జిల్లాలో అమరావతి ఓఆర్ఆర్ వెళ్లే ప్రాంతాలు...
- మంగళగిరి మండలంలో కాజ, చినకాకాని
- గుంటూరు తూర్పు మండలంలో గుంటూరు, బుడంపాడు, ఏటుకూరు,
- గుంటూరు పశ్చిమ మండలంలో పొత్తూరు, అంకిరెడ్డిపాలెం
- మేడికొండూరు మండలంలో సిరిపురం, వరగాని, వెలవర్తిపాడు, మేడికొండూరు, డోకిపర్రు, విశదల, పేరేచర్ల, మందపాడు, మంగళగిరిపాడు,
- తాడికొండ మండలంలో పాములపాడు, రావెల
- దుగ్గిరాల మండలంలో చిలువూరు, ఈమని, చింతలపూడి, పెనుమూలి, కంఠంరాజు కొండూరు,
- పెదకాకాని మండలంలో నంబూరు, అనుమర్లపూడి, దేవరాయబొట్లపాలెం,
- తెనాలి మండలంలో కొలకలూరు, నందివెలుగు, గుడివాడ, అంగలకుదురు, కఠేవరం, సంగం జాగర్లమూడి
- కొల్లిపర మండలంలో వల్లభాపురం, మున్నంగి, దంతలూరు, కుంచవరం, అత్తోట
- చేబ్రోలు మండలంలో గొడవర్రు, నారాకోడూరు, వేజెండ్ల, సుద్దపల్లి, శేకూరు
- వట్టిచెరుకూరు మండలంలో కొర్నెపాడు, అనంతవరప్పాడు, చమళ్లమూడి, కుర్నూతల

- పల్నాడు జిల్లాలో ఓఆర్ఆర్ వెళ్లే ప్రాంతాలు...

- పెదకూరపాడు మండలంలో ముస్సాపురం, పాటిబండ్ల, తాళ్లూరు, లింగంగుంట్ల, జలాల్పురం, కంభంపాడు, కాశిపాడు
- అమరావతి మండలంలోని ధరణికోట, లింగాపురం, దిడుగు, నెమలికల్లు

ఎన్టీఆర్ జిల్లాలో ఓఆర్ఆర్ వెళ్లే ప్రాంతాలు...

- వీరులపాడు మండలంలోని పొన్నవరం, జగన్నాథపురం, తిమ్మాపురం, గూడెం మాధవరం, జుజ్జూరు, చెన్నారావుపాలెం, అల్లూరు, నరసింహారావు పాలెం
- కంచికచర్ల మండలంలోని కంచికచర్ల, మున్నలూరు, మొగులూరు, పెరెకలపాడు, గొట్టుముక్కల, కునికినపాడు
- జి.కొండూరు మండలంలోని జి.కొండూరు, దుగ్గిరాలపాడు, పెట్రంపాడు, కుంటముక్కల, గంగినేనిపాలెం, కోడూరు, నందిగామ,
- మైలవరం మండలంలోని మైలవరం, పొందుగుల, గణపవరం

కృష్ణా జిల్లాలో ఓఆర్ఆర్ వెళ్లే ప్రాంతాలు...

- గన్నవరం మండలంలోని సగ్గురు ఆమని, బుతుమిల్లిపాడు, బల్లిపర్రు
- బాపులపాడు మండలంలోని బండారుగూడెం, అంపాపురం
- ఉంగుటూరు మండలంలోని పెద్దఅవుటపల్లి, తేలప్రోలు, వెలినూతల, ఆత్కూరు, పొట్టిపాడు, వెల్దిపాడు, తరిగొప్పుల, బొకినాల, మానికొండ, వేంపాడు
- కంకిపాడు మండలంలోని మారేడుమాక, కొణతనపాడు, దావులూరు, కోలవెన్ను, ప్రొద్దుటూరు, చలివేంద్రపాలెం, నెప్పల్లె, కుందేరు
- తోట్లవల్లూరు మండలంలోని రొయ్యూరు, నార్త్ వల్లూరు, చినపులిపాక, బొడ్డపాడు, సౌత్ వల్లూరు

ఏలూరు జిల్లాలో ఓఆర్ఆర్ వెళ్లే ప్రాంతాలు...

- ఆగిరిపల్లి మండలంలోని బొడ్డనపల్లె, గరికపాటివారి కండ్రిక, ఆగిరిపల్లి, చొప్పరమెట్ల, పిన్నమరెడ్డిపల్లి, నూగొండపల్లి, నరసింగపాలెం, కృష్ణవరం, సగ్గూరు, సురవరం, కల్లటూరు. 

--అశోక్ కుమార్ యార్లగడ్డ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com