'బార్కాస్ బజార్' ఒక అరబ్ వస్తువుల ద్వీపం
- July 05, 2016
అరబ్ సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన బార్కాస్ ప్రాంతంలో రంజాన్ సందడి నెలకొంది. పాతబస్తీతో సంబంధం లేకుండా ప్రత్యేకమైన వస్తువులు లభ్యమవడం ఇక్కడి విశేషం. రంజాన్ మాసం నుంచే బార్కాస్ బజార్‌లో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున షాపింగ్ చేస్తున్నారు. కాగా రంజాన్‌కు మరో ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉండడంతో బార్కాస్ బజార్‌లో రద్దీ మరింత పెరిగింది.
రాత్రి పూట ఇక్కడి ప్రజలు గావ తాగుతూ పెద్ద ఎత్తున షాపింగ్ చేయడంతో నిమగ్నమవుతున్నారు. ఇక్కడ లభించే వస్తువులన్ని నాణ్యతతో ఉన్నందునే స్థానికులు ఎంతో ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారని వ్యాపారస్థులు పేర్కొంటున్నారు. పాత నగరానికి ఆనుకొని ఉన్నప్పటికీ ఈ ప్రాంత ఆచార వ్యవహారాలన్ని అరబ్ దేశాలవే. వహ్లాన్, బామ్స్, అవల్గీ, యాఫై, బహమాద్, కసేరీ తదితర రకాల కుటుంబీకులు బార్కాస్‌లో నివాసం ఉంటున్నారు.
ప్రతిదీ ఇంపోర్టెడే.. బార్కాస్‌లో ప్రతి చిన్న వస్తువు అరబ్ నుంచి దిగుమతి అయ్యేదే. సూది, నెయిల్ కట్టర్, అత్తర్ పరిమళాలు, బెడ్ షీట్లు, టీవీలు, బురఖా, ఖర్జూర్, ఉద్దాన్, సేవింగ్ కిట్, టీ-షర్ట్ ఇలా ప్రతి వస్తువు కూడా ఇండోనేషియా, ఇటలీ తదితర దేశాలలో తయారైన వాటినే బార్కాస్ వాసులు వాడుతుంటారు. అజ్మల్, రసానీ, ఫ్రెష్ అండ్ ఫ్రెష్ తదితర కంపెనీల అత్తర్ పరిమళాలు ఇక్కడ లభిస్తుంటాయి.
పెద్ద ఎత్తున లుంగీల కొనుగోలు.. బార్కాస్ బస్తీలోని ఏ గల్లీలో చూసినా పహిల్వాన్లే కనిపిస్తుంటారు. ఇక్కడ దాదాపు ప్రతి ఒక్కరు లుంగీలు ధరించడం ఆనవాయితీగా వస్తోంది. ఏ వీధిలో చూసినా... రంగురంగుల లుంగీలు ధరించిన వారే కనిపిస్తారు. వయో భేదం లేకుండా చిన్నారుల దగ్గర నుంచి వయో వద్ధుల వరకు లుంగీలు వాడతారు. కాగా ప్రస్తుతం రంజాన్ కావడంతో పురుషులంతా లుంగీలు కొనుగోలు చేస్తున్నారు. ఈ లుంగీల ధరలు వందల్లో ప్రారంభమై రూ.7 వేల వరకు పలకడం విశేషం. ఈ లుంగీలను ఇండోనేషియా, దుబాయి, సౌదీ అరేబియా తదితర దేశాల నుంచి ప్రత్యేకంగా దిగుమతి చేసుకుంటారు. బార్కాస్ వాసులు ధరించే లుంగీలు దాదాపు 15 ఏళ్ల వరకు చెక్కుచెదరకుండా ఉంటాయి.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









