అల్ దఖిలియాకు పోటెత్తిన టూరిస్టుల..పర్యాటక ప్రదేశాల్లో రద్దీ..!!
- March 20, 2025
నిజ్వా: అల్ దఖిలియా గవర్నరేట్‌లోని వారసత్వ, పర్యాటక ప్రదేశాలను సందర్శించే వారి సంఖ్య భారీగా పెరిగిందని ఒమన్ పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2023లో నమోదైన 312,243 మంది సందర్శకులతో పోలిస్తే 2024లో 415,081 మందికి చేరుకుందని తెలిపింది. అల్ దఖిలియా గవర్నరేట్ దాని భౌగోళిక వైవిధ్యం, వారసత్వ అద్భుతాల కారణంగా ఒమన్‌లోని అత్యంత ప్రముఖ గమ్యస్థానాలలో ఒకటిగా పరిగణించబడుతుందని వెల్లడించింది. ఇటీవల చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులు కూడా టూరిజానికి తోడ్పాటు అందిస్తుందని పేర్కొన్నారు. హోటల్, అడ్వెంచర్ తదితర ఈవెంట్ల నిర్వాహణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు..దాంతో పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని మంత్రిత్వశాఖ గుర్తుచేసింది.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







