919 దిగుమతి చేసుకున్న మద్యం సీసాలు.. నలుగురు అరెస్టు..!!
- March 20, 2025
కువైట్: ఆల్కహాల్ డ్రింక్స్, సైకోట్రోపిక్ పదార్థాల అక్రమ రవాణాలో పాల్గొన్న నలుగురు సభ్యుల ముఠాను క్రిమినల్ సెక్యూరిటీ విభాగం అరెస్టు చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు తెలిపింది. అరెస్టయిన వారిలో ఇద్దరు పౌరులు, ఒక సౌదీ, ఒక భారతీయుడు ఉన్నాడని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వారి వద్ద నుండి 919 దిగుమతి చేసుకున్న ఆల్కహాల్ డ్రింక్స్ బాటిల్స్ తోపాటు 200 సైకోట్రోపిక్ పిల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. వారిపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీలుగా డ్రగ్స్, ఆల్కహాల్ ప్రాసిక్యూషన్ కార్యాలయానికి అప్పగించినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







