పబ్లిక్ ఫండ్స్ రక్షణ, అవినీతిని ఎదుర్కోవడానికి ‘SAI’ బలోపేతం..!!

- March 20, 2025 , by Maagulf
పబ్లిక్ ఫండ్స్ రక్షణ, అవినీతిని ఎదుర్కోవడానికి ‘SAI’ బలోపేతం..!!

మస్కట్: ది స్టేట్ ఆడిట్ సంస్థ (SAI).. పబ్లిక్ ఫండ్స్ ను రక్షించడానికి, పారదర్శకతను ప్రోత్సహించడానికి, అవినీతిని ఎదుర్కోవడానికి తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఒమన్ విజన్ 2040తో సమన్వయం చేసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని నిధులు, ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న సంస్థలతో కూడిన ఆర్థిక, పరిపాలనా లావాదేవీలను పర్యవేక్షించే బాధ్యత కలిగిన SAI..  తన పర్యవేక్షణకు లోబడి ఉన్న సంస్థలను పర్యవేక్షిస్తుంది.

SAI ప్రతినిధి డాక్టర్ హమీర్ బిన్ నాసర్ అల్ మహ్రౌకి మాట్లాడుతూ.. తమకు నిర్దేశించిన విధులను నెరవేర్చడానికి, ఒమన్ విజన్ 2040లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి, తాము మా వనరులన్నింటినీ ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో అకౌంటింగ్, చట్టపరమైన అంశాలు, పరిపాలనా, సంస్థల పనితీరు ఆడిట్‌లు ఉన్నాయన్నారు.  ఆర్థిక ఉల్లంఘనలు, పెట్టుబడులను పర్యవేక్షించడంతో పాటు, సంస్థ తన అధికార పరిధిలోని సంస్థల అన్ని ఖాతాలను ఆడిట్ చేయడానికి బాధ్యత వహిస్తుందని తెలిపారు. SAI ప్రయత్నాలు చట్టాలు, నిబంధనల అమలుకు, ప్రయోజనాల సంఘర్షణలను నివారించడానికి, ఆర్థిక, పరిపాలనా ఉల్లంఘనలను పరిష్కరించడానికి అంతర్భాగంగా ఉన్నాయని డాక్టర్ అల్ మహ్రౌకి వివరించారు.

2024 అవినీతి అవగాహన సూచికలో సుల్తానేట్ అద్భుతమైన పురోగతి సాధించింది. 12 పాయింట్లతో 20 స్థానాలు పెరిగి అంతర్జాతీయంగా 50వ స్థానంలో నిలిచింది. ఈ కార్యక్రమాలు ఒమన్ విజన్ 2040.. హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ నాయకత్వంలో స్థిరమైన అభివృద్ధిని సాధించడానికి నిబద్ధతతో పనిచేస్తున్నాయని డాక్టర్ అల్ మహరూకి చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com