సహెల్ యాప్ సేవలు పునరుద్ధరణ..!!

- March 20, 2025 , by Maagulf
సహెల్ యాప్ సేవలు పునరుద్ధరణ..!!

కువైట్: సర్వర్లలో సమస్యలు తలెత్తడంలో నిలిచిపోయిన సహెల్ యాప్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఏకీకృత ప్రభుత్వ ఇ-సర్వీసెస్ అప్లికేషన్ "సహెల్" ప్రతినిధి తెలిపారు. సాంకేతిక బృందాలు తీవ్రంగా శ్రమించి సేవలను క్రమంగా తిరిగి ప్రారంభించాయని, వీలైనంత త్వరగా వాటిని పూర్తిగా పునరుద్ధరించడానికి పని జరుగుతోందని చెప్పారు. సేవల కొనసాగింపును నిర్ధారించడానికి సాంకేతిక సహాయ బృందాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు. ఈ తాత్కాలిక పరిస్థితిని అందరూ అర్థం చేసుకున్నారని, సహకరించిన వినియోగదారులకు ధన్యవాదాలు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com