నకిలీ వస్తువులను అమ్ముతున్న 375 మంది స్ట్రీట్ వెండర్స్ అరెస్ట్..!!

- March 23, 2025 , by Maagulf
నకిలీ వస్తువులను అమ్ముతున్న 375 మంది స్ట్రీట్ వెండర్స్ అరెస్ట్..!!

యూఏఈ: రమదాన్ మాసం పురస్కరించుకొని బహిరంగ ప్రదేశాల్లో ఆహార పదార్థాలు, నకిలీ వస్తువులను అక్రమంగా అమ్ముతున్నందుకు 375 మంది వీధి వ్యాపారులను దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు.  లైసెన్స్ లేని విక్రేతల నుండి కొనుగోలు చేయవద్దని నివాసితులను ఈ సందర్భంగా హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఉత్పత్తులను రవాణా చేయడానికి, విక్రయించడానికి ఉపయోగించే అనేక వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.    

యాంటీ-స్ట్రీట్ వెండింగ్ విభాగం అధిపతి లెఫ్టినెంట్ కల్నల్ తాలిబ్ అల్ అమిరి మాట్లాడుతూ.. లైసెన్స్ లేని విక్రేతలు లేదా రోడ్డు పక్కన ఉన్న వాహనాల నుండి వస్తువులను.. ముఖ్యంగా ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేయవద్దని ప్రజలను హెచ్చరించారు. ప్రజలు తమ భద్రత, శ్రేయస్సును నిర్ధారించుకోవడానికి ఆహార కొనుగోళ్ల కోసం లైసెన్స్ పొందిన సంస్థలను మాత్రమే ఆశ్రయించాలని ఆయన కోరారు.  ఈ వస్తువులు సరైన నిర్వహణ, నిల్వ లేకపోవడం వల్ల ఆరోగ్య,  భద్రతా ప్రమాణాలను పాటించడంలో విఫలమవుతాయని, దీనివల్ల వినియోగదారులు తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలకు గురవుతారని అని దుబాయ్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com