షార్జాలో కేవలం 3 రోజుల్లోనే Dh14,000 సంపాదించిన బెగ్గర్..!!

- March 24, 2025 , by Maagulf
షార్జాలో కేవలం 3 రోజుల్లోనే Dh14,000 సంపాదించిన బెగ్గర్..!!

యూఏఈ: షార్జా పోలీసులు కేవలం మూడు రోజుల్లోనే Dh14,000 వసూలు చేసిన ఒక భిక్షగాడిని అరెస్టు చేశారు. స్పెషల్ టాస్క్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలోని యాంటీ-బెగ్గింగ్ బృందం తనీఖీల్లో భాగంగా అరెస్ట్ చేసింది. రమదాన్ ప్రారంభం నుండి ఈ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను అరికట్టడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా అనేక మంది బెగ్గర్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక మసీదు దగ్గర భిక్షాటన చేస్తున్నాడని ఫిర్యాదు రావడంతో పోలీసులు స్పందించారు. పోలీసు గస్తీ బృందాన్ని పంపి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో అతను దేశంలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నాడని తేలింది. అతను కేవలం మూడు రోజుల్లో భిక్షాటన ద్వారా దిర్హామ్‌లు 14,000 సేకరించాడని స్పెషల్ టాస్క్‌ల విభాగం డైరెక్టర్, బెగ్గర్స్ ట్రాకింగ్ బృందం అధిపతి డీన్ అల్ రకన్ ఒమర్ గజల్ అల్ షంసీ తెలిపారు. బెగ్గింగ్ అనేది నేరమని, ఎవరూ వారి మాటలకు స్పందించవద్దని కోరారు. ఎవరైనా బెగ్గర్స్ కనిపిస్తే టోల్-ఫ్రీ నంబర్ 80040 లేదా 901లోని కాల్ సెంటర్‌కు కాల్ చేయడం ద్వారా నివేదించాలని షార్జా పోలీసులు కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com