తెలంగాణ: తొలిరోజు 90మంది ప్రజాప్రతినిధుల లేఖలు..
- March 24, 2025
తిరుమల: తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సులను అనుమతించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఈనేపథ్యంలో తొలి రోజే పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజా ప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలు అందాయి. ఆదివారం ఒక్క రోజే 90 మంది ప్రజా ప్రతినిధులు ఈ సిఫార్సు లేఖలను జారీ చేశారు. ఈ సిఫార్సు లేఖలను నిన్న అదనపు ఈవో కార్యాలయ అధికారులు స్వీకరించారు. వీరికి ఈరోజు (సోమవారం) వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తిరుమలలో శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ అనుమతించలేదు. దీంతో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని ఏపీ ప్రభుత్వానికి ఆ ప్రాంత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు తరచుగా విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. వీరి విజ్ఞప్తిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు.దీంతో శ్రీవారి దర్శనం కోసం తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను స్వీకరించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. మార్చి 24 (ఈరోజు) నుంచి గతంలో నిలిచిపోయిన ఈ సౌకర్యాన్ని పునరుద్ధరించారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







