సౌదీ అరేబియాలో హోటళ్లపై కొరడా..గరిష్టంగా SR1 మిలియన్ జరిమానా..!!
- March 25, 2025
రియాద్: సౌదీ అరేబియాలో నిబంధనలు ఉల్లంఘించే హోటల్స్ పై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. ముఖ్యంగా పర్యాటక చట్టం నిబంధనలను ఉల్లంఘించేవారిపై చట్టబద్ధమైన జరిమానాలను విధిస్తున్నట్లు పర్యాటక మంత్రిత్వ శాఖ తెలిపింది. పర్యాటక మంత్రిత్వ శాఖ నుండి లైసెన్స్ లేకుండా పనిచేసే ఏదైనా సంస్థకుగరిష్టంగా SR1 మిలియన్ జరిమానా, మూసివేత లేదా రెండూ ఉంటాయని హెచ్చరించింది.
కాగా, గతంలో చర్యలు తీసుకున్న వాటిలో తనిఖీలు చేస్తున్నామని, నిబంధనలు పాటించేవాటికి మళ్లీ అనుమతి ఇస్తున్నామని వెల్లడించింది. సందర్శకులు, పర్యాటకుల భద్రత తమ లక్ష్యమని స్పష్టం చేసింది. మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా..ఎలక్ట్రానిక్ లైసెన్సింగ్ పోర్టల్ ద్వారా లైసెన్స్‌లను పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లేదా యూనిఫైడ్ టూరిజం సెంటర్‌ను నేరుగా సంప్రదించడం ద్వారా అవసరమైన మద్దతును పొందవచ్చన్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







