హైదరాబాద్‌లో జాబ్‌ మేళా..

- March 26, 2025 , by Maagulf
హైదరాబాద్‌లో జాబ్‌ మేళా..

హైదరాబాద్: హైదరాబాద్‌లోని నిరుద్యోగ యువత కోసం ఇవాళ జాబ్‌ మేళా నిర్వహిస్తున్నారు. దీని ద్వారా ప్రైవేట్ సెక్టార్‌లో ఉద్యోగాలు ఇస్తారు. ఈ విషయాన్ని హైదరాబాద్ జిల్లా ఉపాధి అధికారి వందన ఓ ప్రకటనలో చెప్పారు.

మల్లేపల్లి గవర్నమెంట్ ఐటీఐలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో బుధవారం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపారు. వైఎస్ఎఫ్ స్కిల్స్ సంస్థలో మొత్తం 100 ఉద్యోగాల కోసం దీన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 8-10వ తరగతి (ఉత్తీర్ణులు కాకపోయినా) మధ్య చదువుకున్న వారు, ఐటీఐ, డిగ్రీ ఉన్నవారు జాబ్‌ మేళాకు రావచ్చని అన్నారు.

బయోడేటాతో పాటు క్వాలిఫికేషన్లకు సంబంధించిన సర్టిఫికెట్లతో హాజరు కావాలని తెలిపారు. మరిన్ని వివరాల కోసం http://www. employment.telangana.gov.in చూడొచ్చని అన్నారు. లేదంటే 8328428933 నంబరుకు ఫోన్ చేసినా చెబుతారని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com