12 ఏళ్ల అందమైన కన్నె పిల్ల అమ్మకానికి సిద్ధం...
- July 06, 2016
12 ఏళ్ల అందమైన కన్నె పిల్ల అమ్మకానికి సిద్ధంగా ఉంది.. ఆమె ధర 12500 డాలర్లకు చేరింది.. తొందర్లోనే ఆమెను అమ్మేస్తున్నాం.. ఇదీ వాట్సాప్, టెలిగ్రామ్‌లాంటి యాప్స్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పబ్లిగ్గా పెడుతున్న సందేశాలు. ఇరాక్, సిరియాలను ఆక్రమించుకున్న ఇస్లామిక్ స్టేట్ దారుణాలు ఇలా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా అందమైన కన్నె పిల్లలను ఇలా అమ్ముకుంటూ సొమ్ముచేసుకుంటున్న విషయం బయటపడింది. అలా వచ్చిన డబ్బులతో ఆయుధాలను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇరాక్‌లో ఖుర్దిష్ భాష మాట్లాడే యాజిది సామాజిక వర్గం అమ్మాయిలనే ఐఎస్ ఇలా అమ్మకానికి పెడుతోంది. సుమారు మూడు వేల మంది అమ్మాయిలు ఇప్పటికీ ఐఎస్ దగ్గర బందీలుగా ఉన్నారు.బందీలను రక్షించే స్మగ్లర్లను ఐఎస్ లక్ష్యంగా చేసుకుంటోంది. వారు తప్పించుకోకుండా బందీల ఫొటోలు, వారి యజమానుల పేర్లను చెక్ పాయింట్స్ దగ్గర ఉంచుతున్నారు. 2014 ఆగస్ట్‌లో ఉత్తర ఇరాక్‌ను ఆక్రమించుకున్నప్పటి నుంచీ అక్కడున్న వేలాది మంది యాజిదీస్‌ను ఊచకోత కోసారు ఐఎస్ ఉగ్రవాదులు. కొంతమంది ఆడపిల్లలను బందీలుగా చేసుకొని వారిని లైంగిక బానిసలుగా మార్చేశారు. స్మగ్లర్లు ఇప్పటివరకు 2554 మందిని విడిపించగలిగారు. కానీ గత రెండు నెలలుగా ఐఎస్ తమ భద్రతను కట్టుదిట్టం చేయడంతో చాలామంది తప్పించుకోలేకపోయారు. లామియా అనే యువతి మార్చి నెలలో ఇలాగే తప్పించుకోవడానికి ప్రయత్నించిన సమయంలో లాండ్ మైన్ పేల్చారు ఉగ్రవాదులు. ఈ ఘటనలో ఆమెతో పాటు ఉన్న ఇద్దరు మహిళలు చనిపోగా.. లామియా తన కళ్లను కోల్పోయింది. ఐఎస్ ప్రత్యేకంగా యాజిదీస్‌నే లక్ష్యంగా చేసుకోవడానికి ఓ కారణం ఉంది. కొన్ని వందల ఏళ్లుగా వాళ్లు ఇస్లాం, క్రిస్టియానిటీ, జొరాస్ట్రియనిజం మతాలను సమ్మేళనంగా ఉన్న ఆచారాలను పాటిస్తున్నారు. ఇది సున్నీ ఉగ్రవాదులకు నచ్చలేదు. యుద్ధానికి ముందు ఇరాక్‌లో ఐదు లక్షల మంది యాజిదీస్ ఉండేవారు. ప్రస్తుతం వారెంత మంది ఉన్నారో కూడా తెలియడం లేదు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







