భక్తులకు మెరుగైన సేవలందించండి: సీఎం చంద్రబాబు
- April 02, 2025
విజయవాడ: పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు మరింత మెరుగైన సేవలదించాలని టిటిడి పాలకమండలికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.సామన్య భక్తులకు పెద్ద పీట వేయాలని కోరారు.తిరుమల తిరుపతి దేవస్ధానంపై ముఖ్యమంత్రి ఈరోజు టిటిడి పాలకమండలి సభ్యులతో సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా భక్తుల సౌకర్యాలు మెరుగుపరిచేందుకు గత 9 నెలల కాలంలో తీసుకున్న చర్యలపై టీటీడీ ప్రజెంటేషన్ ఇచ్చింది. పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో భవిష్యత్‌లో చేపట్టే చర్యలపై టీటీడీ పెద్దలతో సీఎం సమీక్ష జరిపారు. టీటీడీ దర్శనాలు, వసతితో పాటు వివిధ సేవలపై భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలపైనా చర్చించారు. బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక సమాయాలతో పాటు…సాధారణ రోజుల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, వారి అభిప్రాయాలపైనా చర్చకు వచ్చింది.
శ్రీవారి లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదంలో తీసుకువచ్చిన మార్పులపై నివేదికను సీఎం చంద్రబాబుకు టీటీడీ ఇచ్చింది. గ్యాలరీల్లో సౌకర్యాల పెంపు, మరింత మంది భక్తులకు అవకాశం కల్పించేలా మాఢవీధులలో ఏర్పాట్లు, అలిపిరిలో భక్తుల కోసం బేస్ క్యాంప్ నిర్మాణం, శ్రీ పద్మావతీ అమ్మవారి దేవాలయం అభివృద్ది ప్రణాళిక, అమరావతిలోని శ్రీవారి దేవాలయం అభివృద్ది పనులు వంటి అంశాలపై సమీక్షలో చర్చించారు. తిరుమల ప్రతిష్ట పెంచడం, తిరుమల క్షేత్రాన్ని భక్తులకు మరింత దగ్గర చేయడం, సులభమైన, సౌకర్యవంతమైన సేవలకు సంబంధించి వివరాలను టీటీడీ అధికారులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి. రాష్ట్రం వెలుపల ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న శ్రీవారి ఆలయాల పురోగతిపై సీఎంకు నివేదిక సమర్పించింది టీటీడీ. అనంతరం చంద్రబాబు భక్తుడికి, భగవంతుడికి అనుసంధానకర్తగా టిటిడి పాలకమండలి పనిచేయాలని కోరారు..
తాజా వార్తలు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!
- ఒమాన్ రియాల్ కు అగౌరవం..మహిళ అరెస్ట్..!!
- జనవరి 15 వరకు 36 నివాస ప్రాంతాలలో రోడ్ పనులు..!
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!
- ప్రభుత్వ-ప్రైవేట్ జాయింట్ ఆర్థిక కమిటీ సమావేశం..
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..







