యూఏఈ దిగుమతులపై ట్రంప్ ఎఫెక్ట్.. 10% సుంకం విధింపు..!!
- April 03, 2025
యూఏఈ: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ యుద్ధానికి తెర లేపారు. పలు దేశాలపై టారిఫ్ లను పెంచుతూ ఉత్తర్వులను జారీ చేశారు. ఇది మా స్వాతంత్ర్య ప్రకటన అని ట్రంప్ వైట్ హౌస్ రోజ్ గార్డెన్‌లో జరిగిన కార్యక్రమంలో అన్నారు. అమెరికా వస్తువులపై విధించిన సుంకాలకు ప్రతిస్పందనగా చైనాపై 34 శాతం, యూరోపియన్ యూనియన్‌పై 20 శాతం సహా పరస్పర సుంకాలను జాబితా చేసిన పోస్టర్‌ను ఆయన ప్రదర్శించారు.
ఈ సుంకాలలో జిసిసి దేశాలపై సుంకాలు కూడా ఉన్నాయి. యూఏఈ పై 10 శాతం, జోర్డాన్‌పై 20 శాతం , సౌదీ అరేబియాపై 10 శాతం కూడా ఉన్నాయి.
అంతకుముందు, ట్రంప్ మే నెలలో యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్‌లను సందర్శించాలని యోచిస్తున్నట్లు ప్రకటించారు. కొత్త సుంకాలు ఏప్రిల్ 5 నుండి అమల్లోకి వస్తాయని , కొన్ని దేశాలకు అధిక రేట్లు ఏప్రిల్ 9 నుండి అమలు చేయబడతాయని వైట్ హౌస్ తెలిపింది .
ట్రంప్ గత వారం ప్రకటించిన ఆటో దిగుమతులపై ప్రత్యేక సుంకాలు ఏప్రిల్ 3 నుండి అమల్లోకి వస్తాయని పరిపాలన అధికారిక నోటీసును ప్రచురించింది. ట్రంప్ ఇప్పటికే చైనా నుండి వచ్చే అన్ని దిగుమతులపై 20 శాతం సుంకాలు, ఉక్కు మరియు అల్యూమినియంపై 25 శాతం సుంకాలను విధించారు. సుంకాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నెమ్మదింపజేస్తాయని, మాంద్యం ప్రమాదాన్ని పెంచుతాయని, సగటు అమెరికన్ కుటుంబానికి జీవన వ్యయాలను వేల డాలర్లు పెంచుతాయని ఆర్థికవేత్తలు హెచ్చరించారు. ట్రంప్ బెదిరింపుల కారణంగా తమ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవడం కష్టమైందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్‌లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!