మెడికవర్ హాస్పిటల్స్ లో 'న్యూరో స్టెంటింగ్' ద్వారా 69 ఏళ్ళ మహిళ కొత్త జీవితం
- December 16, 2025
హైదరాబాద్: హైటెక్ సిటీ: 69 ఏళ్ళ మహిళ తీవ్రమైన పక్షవాతంతో (Stroke) మెడికవర్ హాస్పిటల్స్ ఎమర్జెన్సీ విభాగానికి తీసుకోనిరావడం జరిగింది. అత్యంత క్లిష్టమైన మరియు ఆధునికమైన 'న్యూరో స్టెంటింగ్' చికిత్సను విజయవంతంగా అందించడం ద్వారా ఆమెను శాశ్వత వైకల్యం నుంచి రక్షించబడింది.ఈమెకు వచ్చిన పక్షవాతం (Acute Ischemic Stroke) చాలా అరుదైనది మరియు ప్రమాదకరమైనది. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ముఖ్యమైన రక్తనాళం (Left Internal Carotid Artery) లో తీవ్రమైన అడ్డంకి ఏర్పడింది. దీనివల్ల మెదడులోని సున్నితమైన భాగాలకు రక్తప్రవాహం పూర్తిగా ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది. దీనిని వైద్య పరిభాషలో 'వాటర్‌షెడ్ ఇన్ఫార్క్ట్' అంటారు. అధునాతన స్కానింగ్ ద్వారా సమస్యను వెంటనే గుర్తించడం జరిగింది. సమయానికి చికిత్స చేయకపోతే ఆమెకు శాశ్వతంగా వైకల్యం వచ్చే అవకాశం లేదా ప్రాణాపాయం ఉండేది. రోగి ప్రాణాన్ని రక్షించడానికి, పక్షవాతం పునరావృతం కాకుండా నివారించడానికి వెంటనే న్యూరో స్టెంటింగ్ చికిత్స చేయాలని నిర్ణయించడం జరిగింది. 2025 నవంబర్ 13న, అత్యంత ఖచ్చితత్వంతో కూడిన Neuroform Atlas అనే అత్యాధునిక స్టెంట్‌ను ఉపయోగించి, అడ్డంకి ఏర్పడిన రక్తనాళాన్ని తెరిచి, మెదడుకు రక్తప్రవాహాన్ని పునరుద్ధరించారు.ఈ క్లిష్టమైన మరియు సురక్షితమైన ప్రక్రియను మెడికవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీలోని కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్ డా. రంజిత్ విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
అనంతరం డా.రంజిత్ మాట్లాడుతూ, “వాటర్‌షెడ్ స్ట్రోక్స్ చాలా ప్రమాదకరమైనవి. మెదడులో కొన్ని ప్రాంతాలు “చివరి రక్త సరఫరా”పై ఆధారపడి ఉంటాయి. రక్తపోటు అకస్మాత్తుగా తగ్గినప్పుడు లేదా ప్రధాన రక్తనాళంలో తీవ్రమైన అడ్డంకి ఏర్పడినప్పుడు, ఈ ప్రాంతాలకు రక్తం చేరక మెదడు కణాలు దెబ్బతింటాయి. దీనినే వాటర్‌షెడ్ స్ట్రోక్ అంటారు. ముఖ్యంగా వృద్ధులలో, సరైన సమయంలో చికిత్స అందకపోతే ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. ఆధునిక న్యూరో ఇంటర్వెన్షనల్ టెక్నాలజీల ద్వారా, ఇప్పుడు మేము ఇటువంటి క్లిష్టమైన రక్తనాళాల సమస్యలకు సురక్షితంగా చికిత్స అందించి, రోగులు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయగలుగుతున్నాం.పక్షవాతం లక్షణాలను త్వరగా గుర్తించడం వెంటనే హాస్పిటల్ కి రావడం ద్వారా ప్రాణాలను కాపాడగలిగాం.అకస్మాత్తుగా ఒక చేయి లేదా కాలు బలహీనపడటం, మాట తడబడటం, చూపు మందగించడం, లేదా తీవ్రమైన తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే 'స్ట్రోక్ స్పెషలిస్ట్' ను సంప్రదించాలి అని అన్నారు.
తాజా వార్తలు
- వరల్డ్ కప్ విజేతలకు విశాఖలో స్వాగతం..
- ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన టాప్-6 ఆటగాళ్లు వీరే!
- జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి
- మెడికవర్ హాస్పిటల్స్ లో 'న్యూరో స్టెంటింగ్' ద్వారా 69 ఏళ్ళ మహిళ కొత్త జీవితం
- చంద్రబాబు పాలనపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్..
- బహ్రెయిన్ లో సివిల్ డిఫెన్స్ సేఫ్టీ క్యాంపెయిన్ ప్రారంభం..!!
- MMA ఛాంపియన్షిప్.. సిల్వర్ మెడల్ సాధించిన ఇషాక్..!!
- ఫామ్, క్యాంప్ ఓనర్లను హెచ్చరించిన ఖతార్..!!
- వెదర్ అలెర్ట్..ముసందమ్లో భారీ వర్షాలు..!!
- స్కామ్ అలెర్ట్: గ్యారంటీడ్ రిటర్న్స్ పై నిపుణులు వార్నింగ్..!!







