బహ్రెయిన్ లో సివిల్ డిఫెన్స్ సేఫ్టీ క్యాంపెయిన్ ప్రారంభం..!!

- December 16, 2025 , by Maagulf
బహ్రెయిన్ లో సివిల్ డిఫెన్స్ సేఫ్టీ క్యాంపెయిన్ ప్రారంభం..!!

మనామా: బహ్రెయిన్ లో వింటర్ క్యాంపింగ్ సీజన్‌ సందర్భంగా సివిల్ సేఫ్టీ క్యాంపెయిన్ ను జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ ప్రారంభించింది. ప్రజా భద్రతలో కమ్యూనిటీ పార్టనర్ షిప్ ను ప్రోత్సహించడానికి దాని కొనసాగుతున్న ప్రయత్నాలలో ఇది బాగమని తెలిపింది.  అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పించడంతో పాటు, భద్రత మరియు నివారణ చర్యలను పాటించే ప్రాముఖ్యత గురించి క్యాంపర్లలో అవగాహన పెంచడం ఈ ప్రచారం లక్ష్యమని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా  క్యాంప్‌సైట్ యజమానులకు పలు భద్రతా మార్గదర్శకాలపై అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించింది. వీటికి అందరూ కట్టుబడి ఉండాలని సివిల్ డిఫెన్స్ కోరింది. ముఖ్యంగా విద్యుత్ కనెక్షన్లు సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలని, జనరేటర్లను టెంట్ల నుండి దూరంగా పెట్టాలని, టెంట్ల లోపల స్మోకింగ్ లేదా మంటలను వెలిగించకుండా ఉండాలని,  బొగ్గు లేదా కట్టెలను మండించడానికి గ్యాసోలిన్‌ను ఉపయోగించవద్దని సూచించింది. ఇలాంటి పద్ధతులు ప్రాణాలు, ఆస్తికి తీవ్రమైన ప్రమాదాలు కలిగిస్తాయని హెచ్చరించింది.

క్యాంప్‌సైట్‌లలో పోర్టబుల్ అగ్నిమాపక యంత్రం మరియు ప్రథమ చికిత్స వస్తు సామగ్రి అందుబాటులో పెట్టుకోవాలని తెలిపింది. అలాగే, టెంట్లకు దూరంగా వంట చేయడం సురక్షితమని పేర్కొంది. ఇలాంటి చర్యలు ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడతాయని సివిల్ డిఫెన్స్ సూచించింది. 

  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com