జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి
- December 16, 2025
జోర్డాన్ లో మోదీ సందడి.. యువరాజుతో కారులో షికారు ప్రధాని నరేంద్ర మోదీ జోర్డాన్ లో కారులో తిరుగుతూ సందడి చేశారు.జోర్డాన్ యువరాజు ప్రిన్స్ అల్-హుస్సేన్ బిన్ అబ్దుల్లా-2తో కలిసి సందడి చేశారు.యువరాజుతో కలిసి మోదీ కారులో జర్డాన్ మ్యూజియంకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.ఇవి వైరల్ గా మారాయి. బీఎండబ్ల్యూ కారు లోపల ముచ్చటించుకుంటూ వెళ్తున్నట్లుగా ఫొటోల్లో కనిపించింది.
మోదీ సందర్శించిన ఈ మ్యూజియం దేశంలోనే అతిపెద్దది. అత్యంత ముఖ్యమైన పురావస్తు, చారిత్రిక కళాఖండాలు ఉంటాయి. ఈ మ్యూజియాన్ని చూసేందుకు యువరాజుతో మోదీ కారులో వెళ్లారు. యువరాజే స్వయంగా కారును నడిపారు.
రాజు అబ్దుల్లా-2 ఆహ్వానం మేరకు రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ సోమవారం జర్డాన్ రాజధాని అమ్మాన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ జరిగింది. జోర్డాన్ భారత్ కు మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని మోదీ పేర్కొన్నారు.ఇక జోర్డాన్ పర్యటన తర్వాత ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటించనున్నారు.మోదీ పర్యటనతో జోర్డాన్, భారత్ లమధ్య స్నేహసంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా మెరుగుపడనున్నది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







