బిగ్ టికెట్ విజేతగా భారతీయ ప్రవాసుడు..సొంతమైన Dh15 మిలియన్ల బహుమతి..!!
- April 04, 2025
యూఏఈ: ఏప్రిల్ 3న జరిగిన బిగ్ టికెట్ డ్రాలో ఒమన్‌లో నివసిస్తున్న ఒక భారతీయ ప్రవాసి దిర్హామ్ 15 మిలియన్ల బహుమతిని గెలుచుకున్నాడు. 375678 టికెట్‌తో గ్రాండ్ ప్రైజ్ విజేతగా రాజేష్ ముల్లంకిల్ వెల్లిలపుల్లిథోడి నిలిచారు. అతను మార్చి 30న విజేతకు నిలిపిన టిక్కెట్ ను కొనుగోలు చేశారు. హోస్ట్‌లు అతనికి కాల్ చేయడానికి ప్రయత్నించారు, అయితే, అతను అందుబాటులో లేడు.
గత నెల, దుబాయ్‌కు చెందిన బంగ్లాదేశ్ ప్రవాస జహంగీర్ అలోమ్ మార్చి 3 జరిగిన అబుదాబి బిగ్ టికెట్ డ్రాలో దిర్హామ్ 20 మిలియన్లను గెలుచుకున్నాడు. జహంగీర్ ఫిబ్రవరి 11న కొనుగోలు చేసిన టికెట్ నంబర్ 134468తో అదృష్టవంతుడుగా నిలిచాడు.
బిగ్ టికెట్ ఏప్రిల్‌లో దిర్హామ్‌ల 25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్‌తో అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ఈ జీవితాన్ని మార్చే జాక్పాట్తో పాటు, ఈ నెలలో నగదు బహుమతి టిక్కెట్లను కొనుగోలు చేసే ఎవరైనా వీక్లీ ఇ-డ్రాలో పాల్గొనవచ్చు. ఇక్కడ ఐదుగురు అదృష్ట విజేతలు దిర్హామ్‌లు 150,000 అందుకుంటారు.
బిగ్ టికెట్ బిగ్ విన్ కాంటెస్ట్‌ను కూడా ప్రారంభిస్తోంది. దీని ద్వారా నలుగురు అదృష్టవంతులైన టిక్కెట్ హోల్డర్లు మే 3న లైవ్ డ్రాలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఎంపికైన పాల్గొనేవారి జాబితాను మే 1న బిగ్ టికెట్ వెబ్సైట్లో పోస్ట్ చేస్తారు. దీనికి అర్హత సాధించడానికి, వ్యక్తులు ఏప్రిల్ 1 - 24 మధ్య ఒకే లావాదేవీలో రెండు లేదా అంతకంటే ఎక్కువ నగదు టిక్కెట్లను కొనుగోలు చేయాలి.
వీటితోపాటు రెండు లగ్జరీ కార్లను విజేతలకు అందజేయనున్నారు. రేంజ్ రోవర్ వెలార్ మే 3న బహుమతిగా ఇవ్వబడుతుంది. BMW M440i జూన్ 3న బహుమతిగా ఇవ్వబడుతుందని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- 14 రోజుల్లో 21 ఆస్తులకు విద్యుత్ నిలిపివేత..!!
- యూఏఈలో తొలి లైసెన్స్ స్పోర్ట్స్ బెట్టింగ్ పోర్టల్..!!
- ప్రారంభమైన హెచ్ 1బీ, సోషల్ మీడియా స్క్రీనింగ్..
- ఆస్తుల పర్యాటక లీజు పై ప్రత్యేక కమిటీ..
- తెలంగాణ సత్తా ప్రపంచానికి చాటాం
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!
- కువైట్ నేవీ పెట్రోల్ బోట్ గరో, ఇండియన్ షిప్ కండక్ట్ జాయింట్ డ్రిల్..!!
- దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- సనద్ సేవా కేంద్రాల ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!







