తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- February 24, 2026
తిరుపతి: ప్రముఖ మోహన్ బాబు యూనివర్సిటీలో (MBU) బీటెక్ డేటా సైన్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్న భువన అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపుతోంది.తిరుమల పట్టణంలోని సాయితేజ ప్రైవేట్ లేడీస్ హాస్టల్‌లో ఉంటున్న ఆమె, సోమవారం రాత్రి తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఉదయం తోటి విద్యార్థినులు ఈ విషయాన్ని గమనించి హాస్టల్ యాజమాన్యానికి సమాచారం అందించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనలో హాస్టల్ యాజమాన్యం వ్యవహరించిన తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భువన మృతి చెందిన విషయాన్ని యాజమాన్యం తమకు చాలా ఆలస్యంగా తెలిపిందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తాము హాస్టల్‌కు చేరుకుని ఆందోళన వ్యక్తం చేసిన తర్వాతే యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.Places of Worship
చదువులో చురుగ్గా ఉండే భువన ఆత్మహత్య చేసుకునేంత బలహీనరాలు కాదని, ఆమె మృతి వెనుక ఏవైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో సమగ్ర విచారణ జరిపించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
తిరుపతి జిల్లా పుత్తూరు మండలం మంగళం పంచాయతీకి చెందిన రైతు సురేందర్ రెడ్డి, జానకి దంపతుల కుమార్తె అయిన భువన, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావాలన్న ఆశతో డేటా సైన్స్ కోర్సు చేస్తోంది. మరికొద్ది రోజుల్లో చదువు పూర్తి కావాల్సి ఉండగా, ఇలా విగతజీవిగా మారడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. చదువుల ఒత్తిడి లేక మరేదైనా వ్యక్తిగత కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు హాస్టల్ సిబ్బందిని, స్నేహితులను విచారణా చేస్తున్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







