లుసైల్ స్కై ఫెస్టివల్ ప్రారంభం..ఆకట్టుకుంటున్న ఎయిర్ షోలు, డ్రోన్లు..!!

- April 04, 2025 , by Maagulf
లుసైల్ స్కై ఫెస్టివల్ ప్రారంభం..ఆకట్టుకుంటున్న ఎయిర్ షోలు, డ్రోన్లు..!!

దోహా: ఖతార్ లో లుసైల్ స్కై ఫెస్టివల్ ప్రారంభమైంది. అల్ సాద్ ప్లాజాలో వేలాది మంది సమక్షంలో వేడుకలను అట్టహాసంగా ప్రారంభించారు. ఖతారీ దియర్‌తో భాగస్వామ్యంతో విజిట్ ఖతార్ నిర్వహించిన ఈ ఉత్సవం.. ఈ ప్రాంతంలో ఈ రకమైన అతిపెద్ద కార్యక్రమంగా ప్రశంసలు అందుకుంటుంది. 

 లుసైల్ బౌలేవార్డ్‌లోని లుసైల్ స్కై ఫెస్టివల్‌కు వందలాది సంఖ్యలో సందర్శకులు హాజరయ్యారు. ఏప్రిల్ 3 నుండి 5 వరకు జరిగే ఈ ఉత్సవంలో అంతర్జాతీయ ఏరోబాటిక్ డిస్‌ప్లేలు, ప్రెసిషన్ స్కై రైటింగ్, హై-స్పీడ్ జెట్ స్టంట్‌లు, స్కైడైవింగ్ ప్రదర్శనలతో సహా అద్భుతమైన వైమానిక ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు.

ఈద్ వంటి కీలకమైన సాంస్కృతిక సందర్భాలలో ఖతార్‌ను ప్రపంచ స్థాయి ప్రజా వినోద కేంద్రంగా ఉంచడమే లుసైల్ స్కై ఫెస్టివల్ లక్ష్యం అని నిర్వాహకులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com