సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..సివిల్ డిఫెన్స్ హెచ్చరిక..!!
- April 04, 2025
రియాద్: సౌదీ అరేబియాలో రాబోయే మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని, అంతటా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ కోరింది. సురక్షితమైన ప్రదేశాలలో ఉండాలని, వరదలు సంభవించే ప్రాంతాలు,లోయలకు దూరంగా ఉండాలని సూచించింది.
మక్కా,రియాద్ ప్రాంతాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తబుక్, మదీనా, అల్-జౌఫ్, నార్తర్న్ బోర్డర్స్, తూర్పు ప్రావిన్స్, హెయిల్, ఖాసిమ్, అల్-బహా మరియు అసిర్ ప్రాంతాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయి. జాజాన్ ప్రాంతంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. నజ్రాన్ ప్రాంతంలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక







