ఖురియాత్‌లో గ్యాస్ పేలుడు..ఆరుగురికి గాయాలు..!!

- April 04, 2025 , by Maagulf
ఖురియాత్‌లో గ్యాస్ పేలుడు..ఆరుగురికి గాయాలు..!!

మస్కట్: ఖురియాత్‌లోని విలాయత్‌లోని ఒక వాణిజ్య భవనంలో అకస్మాత్తుగా గ్యాస్ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగులు గాయపడ్డారు.  అనంతరం శిథిలాల కింద చిక్కుకున్న వారిని రెస్క్యూ బృందాలు విజయవంతంగా వెలికితీశాయి. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

కాగా, ఈ పేలుడులో గాయపడ్డ ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పేలుడు ధాటికి పక్కనున్న భవనం కూడా దెబ్బతిందని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ తెలిపింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com