డిగ్రీ ఆశయంతో బహ్రెయిన్ మహిళలకు వివాహం ఆలస్యం..!!

- April 04, 2025 , by Maagulf
డిగ్రీ ఆశయంతో బహ్రెయిన్ మహిళలకు వివాహం ఆలస్యం..!!

మనామా: యూనివర్సిటీ డిగ్రీలు పొందిన బహ్రెయిన్ మహిళలు వివాహం కోసం ఎక్కువ కాలం వేచి ఉంటున్నారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్నవారి వివాహాలు ఆలస్యం అవుతున్నాయని  కుటుంబ సలహాదారు సయీద్ హబీబ్ చెప్పారు. “కొంతమంది ఇప్పటికీ ప్రిన్స్ చార్మింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ప్రపంచం ముందుకు సాగుతుంది.” అని తెలిపారు.

సామాజిక, విద్యాపరమైన కేసులపై పనిచేసే హబీబ్ మాట్లాడుతూ.. చాలా మంది మహిళలు తమ అంచనాలకు సరిపోని ప్రతిపాదనలను తిరస్కరిస్తారని అన్నారు. సమస్య విద్యాపరమైనది మాత్రమే కాదని, అందులో అనేక అంశాలు ఉంటాయని పేర్కొన్నారు.  సాధారణంగా డాక్టరేట్ ఉన్న మహిళ అదే స్థాయిలో ఉండే వ్యక్తిని కోరుకుంటుంది. అదే క్రమంలో ఆమె ఉద్యోగం కూడా గ్యాప్ ని పెంచి వివాహం అనే ప్రతిపాదన పక్కకు పోతుందన్నారు.    

కుటుంబ ఖర్చు

చాలా మంది యువకులకు నెలకు BD400 కంటే తక్కువ జీతం లభిస్తుంది. ఒక వ్యక్తి ఫ్లాట్ అద్దెకు తీసుకోలేకపోతే, అతను ఎలా వివాహం చేసుకోగలడు?” అని హబీబ్ ప్రశ్నించాడు. ఈలోగా, కొంతమంది మహిళలు వారి నుండి దూరమయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విద్యావంతులైన మహిళల్లో, వివాహం ఇకపై స్పష్టమైన సమస్యగా మారనుందని స్పష్టం చేశారు. 

ఈ విషయంలో సోషల్ మీడియా పాత్ర కూడా ఉందన్నారు. ఒకప్పుడు స్థిరత్వానికి ద్వారంగా భావించిన వివాహాన్ని ఇప్పుడు కొందరు పంజరంలా చిత్రీకరిస్తున్నారని తెలిపారు. కొంతమంది అమ్మాయిలు వివాహం వారి స్వేచ్ఛను హరించేస్తుందని నమ్మడం ప్రారంభించారని హబీబ్ అన్నారు.       

  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com