ఏపీలో 38 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ల ప్రకటన
- April 04, 2025
అమరావతి: ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ కొనసాగుతోంది. తాజాగా 38 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను కూటమి ప్రభుత్వం నియమించింది. వాటిలో 31 టీడీపీ, 6 జనసేన, 1 బీజేపీ నేతలకు అవకాశం ఇచ్చారు. మిగిలిన మార్కెట్ కమిటీలకు త్వరలోనే ఛైర్మన్లను ప్రకటించనున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను ప్రభుత్వం ప్రకటించింది. వాటిల్లో 37 టీడీపీ, 8 జనసేన, 2 బీజేపీకు కేటాయించారు.
టీడీపీ నుంచి తుని ఏఎంసీ చైర్మన్ గా
టీడీపీ నుంచి తుని ఏఎంసీ చైర్మన్ గా అంకంరెడ్డి రమేశ్, రాప్తాడులో సుధాకర్ చౌదరి, ప్రత్తిపాడులో బడ్డి మణి, గుడివాడలో ఛాత్రగడ్డ రవి కుమార్, పుత్తూరులో డీఎస్ గణేష్, దర్శిలో దారం నాగవేణి, పాయకరావుపేటలో దేవర సత్యనారాయణ, గన్నవరంలో గరికపాటి శివశంకర్, వేమూరులో గొట్టిపాటి జయవెంకట పూర్ణకుమారి, పర్చూరులో గుంజి వెంకట్రావు, ఈపూరులో జరపల రాములుబాయి, విజయనగరంలో కర్రోతు వెంకట నర్సింగరావు, పాలకొల్లులో కోడి విజయభాస్కర్, చీరాలలో కౌతారపు జనార్ధన్ రావు, మద్దిపాడులో మన్నం రాజేశ్వరి, రేపల్లెలో మత్తి అనురాధకు అవకాశం ఇచ్చారు.
జేపీ తరపున యర్రగుంట్లలో రామిరెడ్డిపల్లి నాగరాజు
అలాగే వినుకొండలో మీసాల మురళీకృష్ణ, రొంపిచర్లలో మొండితోక రాణి, పెద్దాపురంలో నూనే మంగలక్ష్మి, కూచినపూడిలో ఓగిబోయిన వెంకటేశ్వరరావు, గజపతినగరంలో పీవీవీ గోపాల రాజు, నరసన్నపేటలో పగోటి ఉమా మహేశ్వరి, కంభంలో పూనూరు భూపాల్ రెడ్డి, తిరువూరులో రేగళ్ల లక్ష్మీ అనిత, కమలాపురంలో సింగిరెడ్డి రాఘవరెడ్డి, జలుమూరులో తర్రా బలరాం, సంతమాగూలూరులో తేలప్రోలు రమేశ్, రాయదుర్గంలో ఉండాల హనుమంతరెడ్డి, దుగ్గిరాలలో ఉన్నం ఝాన్సీరాణి, నందికొట్కూరులో వీరం ప్రసాదరెడ్డి, గోపాలపురంలో యద్దనపూడి బ్రహ్మరాజు, కనిగిరిలో యరవ రమాదేవికి ఛాన్స్ దక్కింది. జనసేన తరఫున రాజాంలో పొగిరి కృష్ణవేణి, భీమిలిలో కురిమిని రామస్వామి నాయుడు, అలమూరులో కొత్తపల్లి వెంకటలక్ష్మి, పెడనలో భీముని అనంతలక్ష్మి, ఉండిలో జుత్తుగ నాగరాజుకు అవకాశం ఇచ్చారు. అలాగే బీజేపీ తరపున యర్రగుంట్లలో రామిరెడ్డిపల్లి నాగరాజుకు ఏఎంసీ ఛైర్మన్ గా ఛాన్స్ ఇచ్చారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష