అమెరికా ఆంక్షలు.. ఆ 7 సంస్థలు 'దేశంలో పనిచేయడం లేదు' : యూఏఈ

- April 05, 2025 , by Maagulf
అమెరికా ఆంక్షలు.. ఆ 7 సంస్థలు \'దేశంలో పనిచేయడం లేదు\' : యూఏఈ

యూఏఈ: సుడాన్‌లో కార్యాకలాపాలు నిర్వహిస్తున్నాయంటూ యూఏఈ కంపెనీలపై అమెరికా ఆంక్షల విధించింది. అయితే, దీనిపై యూఏఈ స్పందించింది. యూఎస్ ఆంక్షలు విధించిన ఆ ఏడు కంపెనీలు యూఏఈలో  చెల్లుబాటు అయ్యే వాణిజ్య లైసెన్సులు లేవని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు తమ దేశంలో సదరు కంపెనీలు పనిచేయడం లేదని న్యాయ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. 

జనవరి 7న  అమెరికా తన సుడాన్ ఆంక్షల కార్యక్రమం కింద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉన్న ఏడు సంస్థలపై చర్యలు తీసుకుంది.  ఈ సంస్థలలో క్యాపిటల్ ట్యాప్ హోల్డింగ్ LLC, క్యాపిటల్ ట్యాప్ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీస్ LLC, క్యాపిటల్ ట్యాప్ జనరల్ ట్రేడింగ్ LLC, క్రియేటివ్ పైథాన్ LLC, అల్ జుమోరౌడ్, అల్ యాకూత్ గోల్డ్ & జ్యువెలర్స్ LLC, అల్ జిల్ అల్ ఖాదెమ్ జనరల్ ట్రేడింగ్ LLC, హారిజన్ అడ్వాన్స్‌డ్ సొల్యూషన్స్ జనరల్ ట్రేడింగ్ LLC ఉన్నాయి.

ఆంక్షల తర్వాత, యూఏఈ ఈ సంస్థలు వాటి సంబంధిత వ్యక్తులపై తన స్వంత దర్యాప్తును ప్రారంభించింది.  ఈ దర్యాప్తులకు మద్దతుగా అమెరికా అధికారుల నుండి అదనపు సమాచారాన్ని కోరింది.   ఏడు సంస్థలలో ఏవీ యూఏఈలో యాక్టివ్ వ్యాపార లైసెన్స్‌ను కలిగి లేవని లేదా అవి ప్రస్తుతం ఎమిరేట్స్ లో పనిచేయడం లేదని న్యాయ మంత్రిత్వ శాఖ నిర్ధారించింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com