20 ఏళ్లుగా రిజైన్ చేసిన విదేశీ టీచర్ కు సాలరీ..105,331 KD చెల్లింపు..!!

- April 07, 2025 , by Maagulf
20 ఏళ్లుగా రిజైన్ చేసిన విదేశీ టీచర్ కు సాలరీ..105,331 KD చెల్లింపు..!!

కువైట్: 2004లో రాజీనామా చేసి 2005 మధ్యలో కువైట్‌ను విడిచిపెట్టిన ఒక విదేశీ అరబిక్ భాషా ఉపాధ్యాయురాలు.. పరిపాలనా పర్యవేక్షణ కారణంగా దాదాపు 20 సంవత్సరాలు - మొత్తం 105,331 KDల నెలవారీ జీతం అందుకుంటూనే ఉన్నారు. ఆగస్టు 24, 2004న నియమితులైన ఈ ఉపాధ్యాయురాలు 2004/2005 విద్యా సంవత్సరంలో పని ప్రారంభించాల్సి ఉంది కానీ సెప్టెంబర్ 4, 2005 నుండి గైర్హాజరైంది. జూన్ 14, 2005న ఆమె దేశం నుండి వెళ్ళిపోయినప్పటికీ, ఆమె పేరు విద్యా మంత్రిత్వ శాఖ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్‌లో యాక్టివ్ గా ఉంది. దాంతో మే 24, 2024 వరకు ప్రతినెల వారికి జీతాన్ని జమ చేస్తున్నారు.

కాగా, పాఠశాల ప్రిన్సిపాల్ ఆమెను తొలగించాలని కోరుతూ సిబ్బంది వ్యవహారాల విభాగం మరియు ప్రాథమిక పాఠశాల సూపర్‌వైజర్‌తో అనేకసార్లు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే, ఈ సమస్య సంవత్సరాలుగా పరిష్కారం కాలేదు. ఫిబ్రవరి 11, 2024న బయోమెట్రిక్ హాజరు వ్యవస్థను అమలు చేసిన తర్వాత మాత్రమే ఈ లోపం వెలుగులోకి వచ్చింది. దీని ప్రకారం ఉపాధ్యాయురాలు ఇప్పటికీ అధికారికంగా జీతం తీసుకుంటున్న జాబితాలో ఉన్నారని తేలింది. అనంతరం పొరబాటును సరిచేశారు. 

అయితే, సదరు టీచర్ బ్యాంకు అకౌంట్ నుంచి ఇప్పవవరకు అమౌంట్ డ్రా చేయలేదు. ఆ అకౌంట్ ను ఆపరేట్ చేయడం లేదు. కేవలం అందులో జీతం మాత్రమే క్రెడిట్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇది ఎటువంటి నేరపూరిత ఉద్దేశ్యాన్ని సూచించదని, సెంట్రల్ బ్యాంక్ రికవరీ చేసి పూర్తి మొత్తాన్ని విద్యా మంత్రిత్వ శాఖకు తిరిగి ఇచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com