290 మిలియన్ల ఆర్డర్ల డెలివరీలు..45%తో రియాద్ టాప్..!!
- April 07, 2025
రియాద్: సౌదీ అరేబియాలోని డెలివరీ కంపెనీలు 2024 సంవత్సరంలో అద్భుతమైన వృద్ధిని సాధించాయని, నమోదైన ఆర్డర్ల సంఖ్య 290 మిలియన్లను మించిందని ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) వెల్లడించింది. ఈ పెరుగుదల లాజిస్టిక్స్ మార్కెట్ నిరంతర విస్తరణ, వేగవంతమైన, సౌకర్యవంతమైన డెలివరీల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తుందన్నారు. ప్రస్తుతం, 61 కంపెనీలు డెలివరీ రంగంలో పనిచేయడానికి TGA ద్వారా లైసెన్స్ పొందాయని తెలిపారు.
రియాద్ ప్రాంతం 130.5 మిలియన్లకు పైగా ఆర్డర్లతో అగ్రస్థానంలో ఉంది. ఇది డెలివరీ కంపెనీలు నిర్వహించే మొత్తం డెలివరీలలో 45.3 శాతం. రియాద్ తర్వాత మక్కా ప్రాంతం 65.4 మిలియన్ ఆర్డర్లతో (22.7 శాతం), తూర్పు ప్రావిన్స్ 43.2 మిలియన్ ఆర్డర్లతో (15 శాతం) తర్వాతి ప్లేసులో ఉన్నాయి. మదీనా ప్రాంతం 12.3 మిలియన్ ఆర్డర్లను (4.3 శాతం) నమోదు చేయగా, అసిర్ ప్రాంతం 9.4 మిలియన్ ఆర్డర్లను (3.2 శాతం) నమోదు చేసింది. అసిర్ తర్వాత ఖాసిమ్ ప్రాంతం 8.5 మిలియన్ ఆర్డర్లతో (2.9 శాతం), తరువాత తబుక్ 5.2 మిలియన్ ఆర్డర్లతో (1.8 శాతం), హెయిల్ 4.1 మిలియన్ ఆర్డర్లతో (1.4 శాతం), జజాన్ 3.3 మిలియన్ ఆర్డర్లతో (1.1 శాతం) ఉన్నాయి.
స్మార్ట్ అప్లికేషన్లు పౌరులు, ప్రవాసుల జీవితాల్లో అంతర్భాగంగా మారాయని, ఈ అప్లికేషన్లపై వినియోగదారులు ఆధారపడటం డిమాండ్‌ను పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని అథారిటీ నొక్కి చెప్పింది. రాజ్యంలో 50 కంటే ఎక్కువ లైసెన్స్ పొందిన డెలివరీ కంపెనీలు ఉండటం దీనికి నిదర్శనం అని పేర్కొన్నారు. దాంతోపాటు మారుతున్న వినియోగదారుల ప్రవర్తన, ఇ-కామర్స్‌పై పెరుగుతున్న ఆధారపడటం డెలివరీ సేవలకు డిమాండ్‌ను పెంచాయని అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక







