చిరంజీవి హాస్పిటల్లో హైబ్రిడ్ వ్యాస్క్యులర్ చికిత్సలు
- April 07, 2025
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మరెక్కడా లేని అత్యాధునిక హైబ్రిడ్ వ్యాస్క్యులర్ చికిత్సలను చిరంజీవి హాస్పిటల్లో అందిస్తున్నారు.అంతర్జాతీయ స్థాయి హైబ్రిడ్ చికిత్సలతో పేషెంట్ల పాదాలకు..వారి ప్రాణాలకు రక్షణ కల్పిస్తున్నారు.ఇప్పటి వరకు 100కి పైగా అత్యంత క్లిష్టమైన కేసుల్లో హైబ్రిడ్ చికిత్సలందించి మెరుగైన ఫలితాలు సాధించారు. ఇటీవల, అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న ఇద్దరు పేషెంట్లకు హైబ్రిడ్ చికిత్సలందించి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు.చికిత్సానంతరం కోలుకున్న ఆ ఇరువురు పేషెంట్లు..చిరంజీవి హాస్పిటల్ వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు.కేపీహెచ్పీ కాలనీలోని చిరంజీవి హాస్పిటల్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హాస్పిటల్ అధినేత డాక్టర్ సంజీవరావు మాట్లాడుతూ.. హైబ్రిడ్ చికిత్సల్లో గొప్ప మైలురాళ్లుగా నిలిచిపోయే రెండు చికిత్సలను తమ హాస్పిటల్ నందు ఇటీవల విజయవంతంగా నిర్వహించామని అన్నారు. యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్, ఓపెన్ సర్జరీలను అత్యాధునిక నైపుణ్యంతో సంయుక్తంగా నిర్వహించడాన్ని హైబ్రిడ్ చికిత్సగా పిలుస్తామని వివరించారు.సిద్ధయ్య అనే పేషెంటుకు ఉదార పొట్ట భాగంలో డీవీటీ సమస్య కారణంగా గతంలో వేరే హాస్పిటల్ నందు ఐవీసీ ఫిల్టర్ అమర్చారు.అయితే, కొద్ది రోజుల తర్వాత ఆ ఫిల్టర్ పక్కకు జరిగి పేగులోకి వచ్చి చేరింది.తత్ఫలితంగా పేషెంట్ భరించలేనంత నొప్పితో బాధపడుతూ ఉన్నాడు. నొప్పిని భరించలేక చివరికి ఆత్మహత్య చేసుకోవాలని స్థాయిలో కుంగుబాటుకు గురయ్యాడు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న సిద్ధయ్యకు హైబ్రిడ్ విధానంలో పేషెంట్ మెడ భాగం ద్వారా ఫిల్టరును తొలగించగలిగాం. ఈ తరహా చికిత్స మన దేశంలో ఇదే మొట్టమొదటిదని చెప్పొచ్చు.మరో కేసులో, ఫకీరా అనే వ్యక్తి కాలి పై భాగంలో రక్తనాళం పూర్తిగా మూసుకుపోయింది.అందువల్ల పేషెంట్ విపరీతమైన నొప్పితో బాధపడుతుండేవాడు. కాలును తొలగించడం తప్ప వేరే మార్గం లేదని అనేక మంది వైద్యులు చెప్పిన దరిమిలా, చిరంజీవి హాస్పిటల్లోని హైబ్రిడ్ చికిత్సల గురించి తెలుసుకుని వచ్చారు. సదరు పేషెంటుకు హైబ్రిడ్ టెక్నాలజీతో చిన్న కోతతో యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ తో పాటు థ్రాంబెక్టమీ చేశాం.ఈ చికిత్సతో పేషెంట్ కాలిని తీసెయ్యకుండా కాపాడటమే కాకుండా అతడు మామూలుగా నడవగలిగేలా చేయగలిగాం.ఈ ఇరువురు పేషెంట్లు చికిత్స అనంతరం మూడు నెలలకు పూర్తిగా కోలుకుని సాధారణ జీవనం గడపగలుగుతున్నారు.ఈ తరహా హైబ్రిడ్ చికిత్సలను 100కు పైగా నిర్వహించామని, రెండు తెలుగు రాష్ట్రాల్లో మరెక్కడా ఇంత పెద్దసంఖ్యలో ఈ చికిత్సలు నిర్వహించలేదని డాక్టర్ సంజీవరావు తెలిపారు.తమ హాస్పిటల్ నందు ఐదువేలకు పైగా వెరికోస్ వెయిన్స్ చికిత్సలు, అనేక అయోటిక్ సర్జరీలు పూర్తి చేసి రికార్డు సృష్టించామని అన్నారు.తమ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో వచ్చాయని, అత్యాధునిక వైద్య సేవలను పేద ప్రజలకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని చెప్పారు.వాస్క్యులర్ సర్జరీలు, కార్డియాలజీ, యూరాలజీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ప్లాస్టిక్ సర్జరీ, డయాలసిస్ చికిత్సలు, ఏవీ ఫిస్టులా సర్జరీ సేవలు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందిస్తున్నామని వివరించారు. రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జరీ సేవలు తమ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నట్లు డాక్టర్ సంజీవరావు వెల్లడించారు.ఈ సమావేశంలో, హైబ్రిడ్ చికిత్సలతో స్వస్థత పొందిన సిద్ధయ్య, ఫకీరా పాల్గొని..తమకు చికిత్సనందించి పునర్జీవితం ప్రసాదించిన వైద్యులకు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సమావేశంలో చిరంజీవి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ లీనా, డాక్టర్ కె.వంశీకృవ్ణ, డాక్టర్ శిల్ప, డాక్టర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి