చైనాలో 100 టన్నుల సియామీస్ మొసళ్ల విక్రయం!
- April 08, 2025
చైనా: సాధారణంగా జంతువులంటే కుక్కలు, పిల్లులు, ఆవులు, గేదెలు లాంటివి గుర్తుకొస్తాయి. వాటిని పెంచుకోవడం, అమ్మడం, కొనడం గురించి వింటాం. కానీ మొసళ్ళను కొనడం గురించి ఎప్పుడైనా విన్నారా? వినడానికి ఆశ్చర్యంగా, వింతగా ఉన్నా ఇది నిజం కాబోతోంది. చైనాలో వంద టన్నుల మొసళ్ళను వేలం వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అవును, మీరు విన్నది నిజమే! చైనాలోని షెంజెన్ కోర్టు ఏకంగా 100 టన్నుల సియామీస్ మొసళ్ళను వేలం వేస్తోంది.
స్వయంగా మొసళ్ళను తీసుకెళ్లాలి
వేలం ఎప్పుడు, ఎలా? ఈ వేలం ప్రక్రియ మార్చి 10న ప్రారంభమై మే 9 వరకు కొనసాగుతుంది. వేలం ప్రారంభ ధర 4 మిలియన్ యువాన్లు (సుమారు రూ.4.7 కోట్లు). అయితే, ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. మొసళ్ళను కొనుగోలు చేసిన వారు వాటిని స్వయంగా తీసుకెళ్లాలి. వాటి బరువు, రవాణా ఖర్చులు అన్నీ కొనుగోలుదారులే భరించాలి. మొసళ్ళను కొనాలంటే ప్రతి ఒక్కరికీ అవకాశం లేదు. మొసళ్ళను కృత్రిమంగా పెంచడానికి లైసెన్స్ ఉండాలి.
సౌందర్య సాధనాల కోసం మొసళ్ళను పెంచుతారు
ఎందుకీ వేలం? గ్వాంగ్‌డాంగ్ హాంగ్‌యి క్రోకోడైల్ ఇండస్ట్రీ కంపెనీ 2005లో మో జున్‌రాంగ్ అనే వ్యక్తిచే స్థాపించబడింది. అతను ఒకప్పుడు “క్రోకోడైల్ గాడ్”గా పిలువబడేవాడు. కానీ అప్పులు తీర్చలేక పోవడంతో అతని ఆస్తులను కోర్టు వేలం వేస్తోంది. గతంలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో కూడా వేలం వేయడానికి ప్రయత్నించారు. కానీ ఎక్కువ ధర కారణంగా ఎవరూ ముందుకు రాలేదు. అలీబాబా యొక్క జ్యుడీషియల్ వేలం సైట్‌లో ఈ ప్రయత్నాన్ని 4,000 మందికి పైగా చూశారు. కానీ ఇంతవరకు ఎవరూ బిడ్ వేయడానికి నమోదు చేసుకోలేదు. మొసళ్ళ పెంపకం ఒక ప్రమాదకరమైన వ్యాపారమా? చైనాలో మొసళ్ళను మాంసం, చర్మం, సౌందర్య సాధనాల కోసం పెంచుతారు. ఈ విషయంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







