పాత సిమ్ కార్డుల స్థానంలో కొత్తవి, త్వరలోనే కేంద్రం కీలక నిర్ణయం

- April 09, 2025 , by Maagulf
పాత సిమ్ కార్డుల స్థానంలో కొత్తవి, త్వరలోనే కేంద్రం కీలక నిర్ణయం

న్యూ ఢిల్లీ: దేశ వ్యాప్తంగా సిమ్ కార్డులను కొత్త సిమ్ కార్డులతో రీప్లేస్ అవకాశాలు కనిపిస్తున్నాయి. చైనాకు చెందిన చిప్ సెట్‌లు వినియోగదారుల సమాచారం సేకరించే అవకాశం ఉందని దేశంలోని టాప్ సైబర్ భద్రతా సంస్థ దర్యాప్తులో గుర్తించారు. ఇదే విషయాన్ని ఇద్దరు అధికారులు అనధికారికంగా చెప్పడంతో త్వరలో జరగబోయే మార్పులపై చర్చ జరుగుతోంది.

నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ (NCSC),హోం మంత్రిత్వ శాఖ చేపట్టిన దర్యాప్తులో జాతీయ భద్రతా సమస్యకు సిమ్ చిప్ సెట్ కారణం అవుతాయని గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. మొదటి దశలో భాగంగా మొబైల్ ఫోన్‌లలో పాత సిమ్ (subscriber identity module) కార్డులను మార్చే అవకాశం ఉంది. చట్టపరమైన సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం యోచిస్తోంది.

టెలికాం సంస్థలైన భారతి ఎయిర్‌టెల్ లిమిటెడ్, వోడాఫోన్ ఐడియా లిమిటెడ్, రిలయన్స్ జియో ఎగ్జిక్యూటివ్‌లు, టెలికమ్యూనికేషన్స్ శాఖల అధికారులతో ఇటీవల సమావేశాలు నిర్వహించింది. NCSC, హోం మంత్రిత్వ శాఖ, DoT, టెలికాం ఆపరేటర్లకు ఇమెయిల్ చేసిన ప్రశ్నలకు ఇంకా సమాధానం రాలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com