ఓల్డ్ దోహా పోర్టులో ఫిషింగ్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- April 10, 2025
దోహా, ఖతార్: ఓల్డ్ దోహా పోర్టులో ఫిషింగ్ ఎగ్జిబిషన్ ప్రారంభ ఎడిషన్ అధికారికంగా ప్రారంభమైంది. నాలుగు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం సంప్రదాయం, ఆవిష్కరణలను అందించనుంది. దాంతోపాటు స్థానిక , ప్రాంతీయ ఫిషింగ్ బ్రాండ్లు, ఇంటరాక్టివ్ అనుభవాలు, ప్రత్యక్ష సముద్ర ప్రదర్శనలు, ఫిషింగ్ పోటీలను ప్రదర్శిస్తుందని ఓల్డ్ దోహా పోర్టు సీఈఓ ఇంజినీర్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ ముల్లా తెలిపారు. ఫిషింగ్ ఎగ్జిబిషన్లో 30 మందికి పైగా ఎగ్జిబిటర్లు , ఫిషింగ్‌లో ప్రత్యేకత కలిగిన 150 కి పైగా స్థానిక, ప్రాంతీయ బ్రాండ్లు పాల్గొంటున్నాయని తెలిపారు.
ఈ ప్రదర్శన ఏప్రిల్ 12 వరకు కొనసాగుతుంది. ఓల్డ్ దోహా ఓడరేవులోని మినా జిల్లాకు దక్షిణంగా ఉన్న మినా పార్క్‌లో ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ప్రజలకు ఉచిత ప్రవేశాన్ని కల్పించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







