తిరుమల: టీటీడీ తరఫున ఒంటిమిట్ట రామయ్యకు ఖరీదైన కానుక
- April 11, 2025
ఒంటిమిట్ట: శ్రీ రామనవమి ఉత్సవాల వైభవంతో కనువిందు చేస్తున్న ఒంటిమిట్ట కోదండరామస్వామికి ఈరోజు రూ.6 కోట్ల విలువైన మూడు బంగారు కిరీటాల సమర్పణ జరిగింది. ప్రముఖ పెన్నా సిమెంట్ సంస్థ అధినేత పెన్నా ప్రతాప రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసివచ్చి స్వామికి సమర్పించారు.
ఇవాళ ఆలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ కిరీటాలను వారు తిరుమల తిరుపతి దేవస్థానాల (TTD) ధర్మకర్తల మండలి చైర్మన్ బీఆర్ నాయుడు, కార్యనిర్వహణాధికారి శ్యామలరావులకు అందచేశారు. ఆలయంలోని మూలమూరతులైన సీతా రామ లక్ష్మణుల కోసం రూ. 6.60 కోట్ల వ్యయంతో విలువైన రాళ్ళను పొదిగించి చేయించిన ఆ మూడు బంగారు కిరీటాల బరువు 7 కిలోగ్రాములని టీ టీ డి ప్రకటించింది. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మూల మూర్థులకు అలంకరించారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







