వాషింగ్టన్లో అమెరికా ఉపాధ్యక్షుడితో సయ్యద్ బదర్ భేటీ..!!
- February 28, 2026
వాషింగ్టన్: వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్‌తో ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైది సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఒమన్-అమెరికన్ సంబంధాలపై సమీక్షించారు. రెండు దేశాల మద్య స్నేహ సంబంధాలను మరియు చారిత్రాత్మక, వ్యూహాత్మక బంధాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. రాబయో రోజుల్లో విభిన్న డొమైన్లలో కలిసి పనిచేయాలని నిర్ణయించారు.
అనంతరం ఇరాన్ అణుశక్తి కార్యక్రమం యొక్క శాంతియుత పరిష్కారానికి సంబంధించిన విషయాలపై కీలకంగా చర్చించారు. జరుగుతున్న దౌత్య పరమైన ప్రయత్నాలతో పాటు, ఒమన్ ఆధ్వర్యంలో అమెరికా-ఇరాన్ చర్చలను ఇరువురు సమీక్షించారు. చర్చల్లో నిర్మాణాత్మక ఆలోచనలు మరియు ప్రతిపాదనలపై తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. విభేదాలను తగ్గించడానికి మరియు గౌరవప్రదమైన ఒప్పందాన్ని సాధించడానికి తీసుకోవల్సిన అంశాలపై సమీక్షించారని ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సమావేశంలో అమెరికా, ఒమన్ కు చెందని మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







